»   » హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ పిలుపు

హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సక్సెస్ కి ఆకర్షణ శక్తి ఎక్కువ. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర కలెక్షన్లు బాలీవుడ్ ని సైతం షేక్ చేస్తున్నాయి. దాంతో బాలీవుడ్ వారు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ లాంటి వారు అత్తారింటికి దారేది చిత్రం కలెక్షన్స్ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటంతో అందరి దష్టీ ఈ చిత్రం పై పడింది. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు రణబీర్ కపూర్ నటించిన 'యే జవానీ హై జిందగీ', షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను కురిపించటం వారిని ఆశ్చర్యపరించింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు.

అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ చేయటం కన్నా అసలు పవన్ తోనే హిందీ,తెలుగు భాషల్లో ఓ చిత్రం నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వారికి కలుగుతోందని సమాచారం.బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ద్విభాషా చిత్రాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని తెలుస్తోంది. ఓవర్సీస్, దక్షిణాది మార్కెట్ ని సైతం పవన్ కళ్యాణ్ కు క్రేజ్ తో క్యాష్ చేసుకోవచ్చని బాలీవుడ్ అంచనా వేసిందని చెప్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి తెలియచేసిన అత్తారింటికి దారేది చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ చిత్రం సుమారు 16 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే పది రోజుల్లోనే 40 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

English summary
Reports say that a few Bollywood filmmakers are planning to approach Pawan Kalyan for a bilingual (Hindi and Telugu) film. A source says, "Bollywood filmmakers are surprised to see Pawan's star power and are want to cash in on his craze. As such, they're planning to initiate talks with the actor soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu