»   »  స్టార్ హీరో మరదలితో ఎఫైర్... కుమారుడికి బోనీ కపూర్ వార్నింగ్!

స్టార్ హీరో మరదలితో ఎఫైర్... కుమారుడికి బోనీ కపూర్ వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, ఆయన భార్య మలైకా అరోరా ఖాన్ సంసారంలో విబేధాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మలైకా భర్తతో విడిపోవడానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్ తో ఆమె ఎఫైర్ నడపడమే అనే ప్రచారం బాలీవుడ్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

భర్తతో విడిపోయిన మలైకా తన కుమారుడితో విడిగా ఉంటోంది. అయితే ఇటీవల అర్థరాత్రి అర్జున్ కపూర్ ఆమె ఫ్లాట్‌కి అర్జున్‌ వెళ్లడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే విషయానికి మరింత బలాన్నిచ్చినట్లయింది. ఈ విషయం మీడియాలో హైలెట్ అయింది.

దాంతో నిర్మాత, అర్జున్‌ కపూర్ తండ్రి బోనీకపూర్‌ ఆందోళనలో పడ్డారు. సల్మాన్‌ ఖాన్‌తో పెట్టుకుంటే ఎక్కడ అర్జున్‌ కెరీర్‌ దెబ్బతింటుందోనని భయపడుతున్నాడట. ఇటీవల అర్జున్ ను పిలిచి మలైకాకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అర్థరాత్రి ఆమె ఇంటికి... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు!

నిన్న మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఎఫైర్ అనేది రూమర్ గానే ఉంది. తాజాగా ఇద్దరూ అర్థరాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవడం హాట్ టాపిక్ అయింది. అర్జుర్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా ముంబైలోని ఖర్‌లో మలైకా నివాసం ఉంటున్న ఫ్లాటుకు వచ్చాడు. వీరి వ్యవహారం బయట పెట్టేందుకు కొంత కాలంగా సీక్రెట్ గా ఫాలో అవుతున్న ఫోటోగ్రాఫర్లకు ఎట్టకేలకు అర్జున్ చిక్కాడు.

ఈ విషయాన్ని ఓ ఫోటోగ్రాఫర్ ఇంగ్లీష్ డైలీకి తెలుపుతూ...'మేము మలైకా ఇంటి బయట ఉన్నాం. అర్థరాత్రి దాటిన తర్వాత అర్జున్ కపూర్ అక్కడికి వచ్చాడు. అతని కారు రాగానే మేము ఒక్క ఫోటో కూడా తీయలేదు. మేము ఉన్నట్లు అతనికి తెలిసిపోతే అతను వెంటనే అక్కడి నుండి వెల్లిపోతాడని మాకు తెలుసు. తొలుత అతని కారు డ్రైవర్ కిందకు దిగి ఎవరైనా ఫోటోగ్రాఫర్లు అక్కడ ఉన్నారేమో అని చెక్ చేసాడు. మేము అతనికి కనిపించలేదు. ఆ తర్వాత అర్జున్ కపూర్ లోనికి వెళ్లి పోయాడు' తెలిపారు.

'అర్జున్ అక్కడ చాలా సేపు గడిపాడు. తర్వాత కొందరు పోలీసులు అక్కడికి వచ్చి మమ్మల్ని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పాడు. అర్జున్ కాల్ చేయడం వల్లనే తాము వచ్చిట్లు పోలీసులు తెలిపారు. ఫోటోగ్రాఫర్లను అక్కడి నుండి పంపించమని అర్జున్ వారికి చెప్పాడు. పోలీసులు మకు చెప్పగానే మేము అక్కడి నుండి వెళ్లి పోయాం' అని సదరు ఫోటో గ్రాఫర్ తెలిపారు. అర్జున్ కపూర్, మలైకాలను లింకప్ చేస్తూ చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సంఘటనతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.

బోనీ కపూర్ వార్నింగ్

బోనీ కపూర్ వార్నింగ్


సల్మాన్‌ ఖాన్‌తో పెట్టుకుంటే ఎక్కడ అర్జున్‌ కెరీర్‌ దెబ్బతింటుందోనని భయపడుతున్నాడట. ఇటీవల అర్జున్ ను పిలిచి మలైకాకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అర్జున్ -మలైకా

అర్జున్ -మలైకా


అర్జున్, మలైకా మధ్య ఎఫైర్ ఉన్నట్లు కొంతకాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

విడాకులు కారణం అదేనా?

విడాకులు కారణం అదేనా?


మలైకా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం ఈ ఎఫైరేనా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

పరిచయం ఎలా?

పరిచయం ఎలా?


మలైకా, అర్జున్ పలు టీవీ షోలలో కలిసి పార్టిసిపేట్ చేసారు. అలా ఇద్దరి హధ్య పరిచయం ఏర్పడిందట.

క్లోజ్ గా మూవ్

క్లోజ్ గా మూవ్


ఇద్దరూ పలు సందర్భాల్లో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఆకర్షణ ఏర్పడిందని టాక్.

పార్టీల్లో..

పార్టీల్లో..


పలు సెలబ్రిటీ పార్టీల్లో కూడా ఇద్దరూ కలసి పాల్గొన్నారు.

మౌనం

మౌనం


ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నా ఇద్దరూ మౌనంగానే ఉంటున్నారు. మౌనంగా ఉన్నారంటే ఎంతో కొంత వాస్తవం ఉన్నట్లేగా?

English summary
The rumours were doing the circle of gossip mills when Malaika Arora and Arbaaz Khan decided to split that Arjun Kapoor's proximity with Malaika is the reason. Malaika and Arjun were reportedly spotted together on various occasions. Now according to a report on Spotboye.com, Arjun's father, film producer Boney Kapoor is not very amused with his choice. The report alleges that Papa Kapoor has asked the Ishqzaade star to maintain distance from Malaika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu