»   » నిజమా..బోయపాటికి డేట్స్ ఇచ్చాడా?

నిజమా..బోయపాటికి డేట్స్ ఇచ్చాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లెజండ్ సూపర్ హిట్ అవటంతో బోయపాటి శ్రీను తన దమ్ము తో వచ్చిన దుమ్మను దులుపుకుని వచ్చేసారు. అయితే ఆయన తదుపరి చిత్రానికి హీరోలు ఎవరూ దొరకటం లేదు. కొంతకాలం మహేష్ బాబు, ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా అని వార్తలు వచ్చాయి...బోయపాటి కూడా వాటిని ఖరారు చేసారు. కానీ అవేమీ వర్కవుట్ కాలేదు. బోయపాటి చెప్పే కథలు బాగా హింసాత్మకంగా ఉండటంతో యంగ్ హీరోలు భయపడుతున్నారని ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను చిత్రం ఓకే అయ్యిందని వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రీసెంట్ గా బోయపాటి శ్రీను వెళ్లి అల్లు అర్జున్ కి కథ వినిపించారని, బన్నీ దానికి చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే డేట్స్ కేటాయిస్తానన్నాడని చెప్పుకుంటున్నారు.

'రేసుగుర్రం'గా పరిశ్రమలో వసూళ్ల పరుగు చేశాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా విడుదలకు ముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డిగా అవతారమెత్తబోతున్నాడు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లువారి కుర్రాడు అంగీకరించాడట.

Boyapati next HERO Allu Arjun?

గోన గన్నారెడ్డి పాత్ర డిమాండ్ మేరకు శారీరిక భాషను మార్చుకోవటం, సిక్స్ ప్యాక్ చేయటం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కత్తి ఫైట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఎందుకూ అంటే...తాను తాజాగా నటిస్తానని కమిటైన గుణశేఖర్ చారిత్రిక చిత్రం రుద్రమదేవి కోసం అని తెలుస్తోంది. ఈ మేరకు తనను తాను తీర్చుకుని, కత్తి తిప్పటంలో ప్రత్యేక ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ మీద తీసే యాక్షన్ సన్నివేశం సినిమాకు హైలెట్ అయ్యి నిలుస్తుందని చెప్తున్నారు.

మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది. వీరిపై జులైలో చిత్రీకరణ జరుపుతాం'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

English summary
Boyapati narrated a storyline to Allu Arjun and the reaction is said to be quite positive.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu