Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాజీ సీఎం కుమారుడితో బోయపాటి సినిమా.. సెట్ చేసింది ఆయనేనా?
ఒకప్పుడు వరుస విజయాలు.. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. గత సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన.. బాలయ్య తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చేలా లేదు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్.. త్వరలోనే బోయపాటితో సినిమా చేస్తున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ఎవరు చేస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అల్లు అరవింద్ ప్రకటన
ఇటీవల కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘‘ఈ ఫంక్షన్‌కు శిష్యుడి కోసం వచ్చిన బోయపాటి గారికి అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే.. నాకు బోయపాటి గారు ‘సరైనోడు'తో సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చారు. మా కాంబినేషన్‌లో మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన మిగిలిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.

మెగా హీరోలు బిజీ
అల్లు అరవింద్ ప్రకటనతో బోయపాటి మళ్లీ మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే, బన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉండడం, చిరు కూడా రెండు సినిమాలు కమిట్ అవడం, చరణ్ ‘RRR'తో బిజీగా ఉండడంతో వాళ్లతో సినిమా కుదరదని అనుకున్నారు. వీళ్లు తప్పితే మిగిలిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌లు కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది.

మాజీ సీఎం కొడుకుతో..
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘జాగ్వార్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కర్నాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడతో బోయపాటి సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందని అంటున్నారు. కన్నడంలో మాస్ సినిమాలు బాగా చూస్తారనే ఉద్దేశ్యంతోనే బోయపాటిని ఎంచుకున్నారని టాక్.

సెట్ చేసింది ఆయనేనట
ఈ కాంబినేషన్‌ను సెట్ చేసింది అల్లు అరవిందేనని తెలుస్తోంది. గతంలో ఎప్పుడో కుమారస్వామికి ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో పలువురు ప్రముఖులు నటిస్తారని వినికిడి.

నిఖిల్ గురించి..
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు.. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ‘జాగ్వార్', ‘సీతమ్మ కల్యాణం', ‘కురుక్షేత్ర' అనే సినిమాలు చేశాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సినీ నటి సుమలత చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇప్పుడు అధికారం కూడా కోల్పోవడంతో సినిమాల వైపు వస్తున్నాడని టాక్.