twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ‘డిక్టేటర్‌’ ట్విస్ట్ : లాస్ట్ మినిట్ లో బ్రహ్మానందం కు బైబై ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్రహ్మానందం ఉంటే సినిమాలో కామెడీ అదురుతుంది. సినిమా యావరేజ్ ఉంటే హిట్ లోకి, హిట్ అయితే సూపర్ హిట్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే బ్రహ్మానందం ని పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతూంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ కమిడియన్ గా బ్రహ్మానందం కు ఎప్పుడూ స్ధానం ఉంటుంది. అయితే బ్రహ్మానందం తన రెమ్యునేషన్ పెంచి ఆఫర్స్ ని పోగొట్టుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తాజాగా బాలకృష్ణ ...డిక్టేటర్ చిత్రంలో కూడా ఆయనకు నో చెప్పినట్లు సమాచారం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బాలకృష్ణ, శ్రీవాసు కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం డిక్టేటర్ కోసం బ్రహ్మానందం ను అడిగినట్లు సమాచారం. ముప్పై రోజుల డేట్స్ కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో ఆయనకు బై చెప్పి,ఫృధ్వీని తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. డిమాండ్ ని బట్టే రేటు అని బ్రహ్మానందం అభిమానులు కొందరు ఈ విషయమై వాదిస్తున్నారు.

    ఇక డిక్టేటర్ చిత్రం విశేషాలకు వెళ్తే....

    Brahmanandam demands 1 cr for Balayya?

    బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్‌' చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇది ఆయనకు నటునిగా 99వ చిత్రం. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు సినీ విలేజ్‌లో ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మ కడలి రూపొందించిన భారీ సెట్‌లో షూటింగ్ మొదలైంది.

    దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణగారి పాత్ర, ఆ పాత్రలో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. టైటిల్‌ని బట్టే ఆయన కేరక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలను సమపాళ్లలో మేళవించాం. అభిమానుల అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుంది. యూరప్‌లో ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమానీ తీయని లొకేషన్లలో పాటలు, టాకీ, యాక్షన్‌ సన్నివేశాల్ని ప్లాన్‌ చేశాం'' అని చెప్పారు.

    నాజర్‌, బ్రహ్మానందం, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిశోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, సుప్రీత్‌, అమిత్‌ తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌, రచన: శ్రీధర్‌ సీపాన, మాటలు: ఎం. రత్నం, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్‌: రవివర్మ.

    English summary
    Director Sriwaas have roped in Brahmanandam for a comedy role in Balakrishna's movie "Dictator". But comedy king demanded nearly 1 crore for 30 days of call-sheets and that has hurt the makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X