For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, త్రివిక్రమ్ సినిమాకు కష్టాలు.. ఏం జరుగుతున్నందంటే..

  By Rajababu
  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చే సరికి ఆ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్‌కు ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్‌గా మారింది. అయితే ఈ చిత్రం షూటింగ్ ముందస్తుగా వేసుకొన్న అంచనా ప్రకారం ముందుకు పోవడం లేదనేది ఫిలింనగర్‌లో తాజా టాక్. ఆ కారణంగా సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే మాట వినిపిస్తున్నది.

  హ్యాట్రిక్ కోసం జతకట్టిన ..

  హ్యాట్రిక్ కోసం జతకట్టిన ..

  త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ పేరు పెట్టని చిత్రం పవన్‌ కెరీర్‌లో 25వది. పవన్, త్రివిక్రమ్ జత కట్టడం ఇది మూడోసారి. జల్సా, అత్తారింటికి దారేది చిత్రం తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు వీరద్దరూ సిద్ధపడ్డారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనుకొన్నారు. ఆ తర్వాత దసరాకు వాయిదా వేశారు.

  Pawan Kalyan Appreciated Alias Janaki Director - Filmibeat Telugu
  ఈ ఏడాది చివర్లో ..

  ఈ ఏడాది చివర్లో ..

  అయితే తాజా రిపోర్టు ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ముగిసే అవకాశముందనేది తాజా సమాచారం. ఒకవేళ అన్ని సవ్యంగా జరిగితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండే అవకాశం ఉంది. లేకపోతే వేసవి సెలవులు టార్గెట్‌గా రిలీజ్ కావడానికి స్కోప్ ఉంది.

  ముందుకెళ్లని షూటింగ్..

  ముందుకెళ్లని షూటింగ్..

  పవన్ సినిమా అనేక కారణాల వల్ల ముందుకు సాగడం లేదనిది సినీ వర్గాల టాక్. పవన్ రాజకీయ కారణాలు ఒక కారణం కాగా, వ్యక్తిగత కారణాలు మరో కారణంగా నిలిచాయట. వచ్చే అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ ఏ మేరకు ముందుకు వెళ్తుందోననేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

  సెంచరీ దాటనున్న బడ్జెట్

  సెంచరీ దాటనున్న బడ్జెట్

  తొలుత ఈ సినిమాను రూ.95 కోట్లతో పూర్తి చేయాలని నిర్మాత రాధాకృష్ణ భావించారు. అయితే షూటింగ్ వాయిదా పడటం కారణంగా బడ్జెట్ రూ.120 కోట్లకు చేరుకొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. ఒకవేళ బడ్జెట్ పెరిగితే నిర్మాతకు ఇబ్బంది కలుగడం పక్కన పెడితే.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కావడం మరో సమస్య అంటున్నారు సినీవర్గాలు.

  భారీగా సెట్టింగులు.. రిచ్‌గా మూవీ

  భారీగా సెట్టింగులు.. రిచ్‌గా మూవీ

  పవన్ కెరీర్‌లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం భారీ సెట్టింగులు వేశారు. రామోజీ ఫిలిం సిటీలో చాలా రోజులుగా షూట్ చేస్తున్నారు. పవన్ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా నటిస్తున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. పవన్ ఆఫీస్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది.

   ఇంకా పేరే పెట్టలేదు..

  ఇంకా పేరే పెట్టలేదు..

  ఇంకా ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ గానీ, ఫస్ట్ లుక్ గానీ ఇంకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, గోపాలకృ‌ష్ణుడు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్, కీర్తీ సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan pinned many hopes on his next film which is his 25th one. The film is directed by Trivikram Srinivas and it marks the third time collaboration of the actor and director after the successful films like Jalsa and Atharintiki Daredi. The film unit is still shooting the movie and the latest update is that they will wrap up the entire shoot by the year end.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X