For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కెమెరామేన్ గంగతో..' ఆడియో ఇంకా లేటుగా?

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం ఆడియో ఈ నెల 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు గా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు కూడా విడుదల అయ్యే అవకాసం కనపడటం లేదని టాక్. ఛీఫ్ గెస్ట్ గా రానున్న చిరంజీవి ఏ రోజు ఖాళీగా ఉంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవటంతో డిలే అవుతోందని సమాచారం. దాంతో నిర్మాతలు అధికారికంగా ఈ ఆడియో విషయమై ఇప్పటివరకూ ఏ ప్రకటన విడుదల చేయలేదు.

  సాధారణంగా పెద్ద సినిమాలకు ఆడియో విడుదలకు, సినిమా రిలీజ్ కు మినిమం ఓ నెల గ్యాప్ ఉండేటట్లు చూస్తారు. పాటలు ప్రేక్షకులు నోట్లో నానితే సినిమాకు అది బాగా ప్లస్ అవుతుందని ఈ స్టాటజీని ఫాలో అవుతూంటారు. ఆడియో హిట్ అవటంపై సినిమా పై క్రేజ్ పెరగటం, దాని ఇంపాక్టు బిజినెస్ పై పడటం జరుగుతూంటుంది. అయితే ఇప్పటికే పవన్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసారు. కానీ ఆడియో విడుదల తేదీ ఇవ్వకపోవటంతో అభిమానులు నిరాస చెందుతున్నారు.

  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి పవన్ అన్నగారైన చిరంజీవి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. గబ్బర్ సింగ్ తర్వతా అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ ఒకే స్టేజిపై కనపడనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. బాబా సెహగల్.. పవనిజం పై పాడిన పాటను కూడా ఈ చిత్రం ట్రాక్ లో కలుపుతున్నారు.

  ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

  English summary
  Cameraman Gangatho Rambabu is gearing up for release next month. Still, the film’s music has not yet been launched. Any big movie’s music would be released a month before its theatrical release. But the producer is yet to announce the date for audio launch officially. Though tentative date is on September 24th, sources say there would be further delay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X