»   » చిరు 150 చిత్రం: మళ్లీ ఇంకో షాకిచ్చే ట్విస్టా?

చిరు 150 చిత్రం: మళ్లీ ఇంకో షాకిచ్చే ట్విస్టా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంపై ఓ స్పష్టత వచ్చినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. మెగాభిమానలు పండుగ చేసుకున్నారు. మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్‌ ఆరంభం కానున్నట్లు చెప్పుకున్నారు.

చిరు 150వ చిత్రం : రామ్ చరణ్ అఫీషియల్ ప్రకటన (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీడియాలో మాత్రం ... రోజుకో రూమరో, వార్తో ఫ్యాన్స్ ని కంగారు పెట్టేవి వస్తున్నాయి.

సొంతింట్లోనే...చిరంజీవి 150కి అనుకోని అడ్డంకి!

ఆ మధ్యన కాపీ వివాదంలో ఇరుక్కున్న ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వెబ్ మీడియాలో ఇంకో వార్తతో హల్ చల్ చేస్తోంది. వినాయిక్ రెడీ చేసిన స్క్రిప్టు మొత్తం విన్న చిరంజీవి డైలమోలో పడ్డాడంటున్నారు . కానీ ఇటివల వినాయక్ మాట్లాడుతూ.. చిరు 'కత్తి' చిత్రం మార్చి నుండి సెట్స్ ఫైకి వెళ్ళబోతుందని , ఫిబ్రవరిలో మరోసారి స్కిప్టుపై కూర్చోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఏంటా డైలమా..ఆ వార్తలేంటి స్లైడ్ షోలో...

ఇమేజ్ కు ఇబ్బంది

ఇమేజ్ కు ఇబ్బంది

ఈ చిత్రంలో రెండో పాత్ర అయిన దొంగ పాత్ర ని మార్చకుండా ఉన్నదున్నట్లు చేస్తే .. తనకు పొలిటికల్ గా తనకున్న ఇమేజ్ కు ఇబ్బంది కలుగుతుందా అని సందేహం వెళ్లబుచ్చాడంటున్నారు.

వినాయిక్ డౌట్

వినాయిక్ డౌట్

అలాగని ఆ పాత్రలో పూర్తి మార్పులు చేద్దామంటే సినిమా రిజల్ట్ మారుతుందేమో అని వినాయిక్ సందేహపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

మారుద్దామా

మారుద్దామా

దాంతో వేరే కథవైపు చిరంజీవి ప్రయాణం పెట్టుకుందామా అన్నట్లు వినపడుతోంది. అయితే ఈ విషయమై ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

రైట్స్ ప్లాబ్లం..

రైట్స్ ప్లాబ్లం..

ఇప్పటికే కథ రైట్స్ విషయమై వివాదం నడుస్తున్న ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం మంచిదని భావిస్తున్నారు.

క్లారిటీ..

క్లారిటీ..

చిరంజీవి కుమార్తె వివాహం అనంతరం ఈ విషయమై క్లారిటీ రానుంది. చిరంజీవి ప్రస్తుతం ఆయన రెండో కుమార్తె వివాహ పనుల హడావిడిలో ఉన్నారు.

ఇంకోసారి కూర్చుని ఫైనల్

ఇంకోసారి కూర్చుని ఫైనల్

ఈ సమయంలో తాను పూర్తి కాన్సర్టేట్ చేయలేనని మరోసారి కూర్చుందామని అన్నట్లుగా వినిపిస్తోంది.

అంతేకాకుండా...

అంతేకాకుండా...

చిరంజీవి కు ఇంకో ఆలోచన ఉందని, ఈ ప్రాజెక్టుని యువ హీరోలు చేస్తే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పుకుంటన్నారు.

మరెవరో కాదు

మరెవరో కాదు


ఆ హీరో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ అని అంటున్నారు. వరుణ్ తేజకి ఫెరఫెక్ట్ ఫిల్మ్ అని చిరంజీవి ..చెప్పినట్లు గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

తొలిసారి నిర్మాత

తొలిసారి నిర్మాత

వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

మొదట అనుకున్నది..

మొదట అనుకున్నది..

నయనతార హీరోయిన్ గా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కత్తి రీమేక్

కత్తి రీమేక్

విజయ్‌ హీరోగా తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

అదే నమ్మకం..

అదే నమ్మకం..

చిరంజీవి, వి.వి. వినాయక్‌ కాంబినేషన్‌లో చివరి సారిగా ‘ఠాగూర్‌' చిత్రం విడుదలైంది. ఆ చిత్రం రీమేక్ కావటం, ఘన విజయం సాధించటమే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లటానికి కారణం.

English summary
Buzz is Chiranjeevi for some reason is planning to quit 150th project and the project will now feature Varun Tej in lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu