17 ఏళ్ల తర్వాత చిరంజీవితో అనుష్క శెట్టి.. ఏ సినిమాతో జోడి కడుతున్నారంటే?
Chiranjeevi 158th Film: మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర'లైన్ లో పెట్టారు. ఈ మూవీ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ కూడా ప్రారంభంమైంది. ఈ మూవీని మేకర్స్ సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, ఇటీవల మరో పెద్ద ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. 'వాల్తేరు వీరయ్య' విజయవంతం చేసిన డైరెక్టర్ బాబీ (KS రవీంద్ర)తో మళ్లీ జట్టు కట్టారు. ఈ కాంబినేషన్‌లో చిరు 158వ సినిమా రూపొందనున్నది. ఈ సినిమాలో కథనాయకగా ఓ స్టార్ హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట.
ఆ హీరోయిన్ ఎవరో కాదు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. టాలీవుడ్ టాక్ ప్రకారం.. చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే 158వ సినిమా కోసం అనుష్కతో సంప్రదింపులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. అనుష్క కూడా ఈ ఆఫర్‌పై పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవితో కలిసి నటించాలని స్వీటి చాలా కాలంగా ఎదురుచూస్తోంది. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునలతో ఆమె స్క్రీన్ షేర్ చేసింది. కానీ, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. అనుష్క గతంలోనే మీడియా ముందుకు వచ్చి "చిరంజీవితో కలసి నటించాలని ఉంది" అని ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోందన్న టాక్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది.

పర్ఫెక్ట్ జంటగా మెరిసే అవకాశం
చిరంజీవి వయసు 70 దాటినా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ యంగ్ హీరోలకే సవాల్ విసురుతుంది. అలాగే.. 43 ఏళ్లలోనూ అనుష్క తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఈ కాంబినేషన్ తెరపై పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అవుతుందని, ఓన్స్క్రీన్ పెయిర్‌గా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అనుష్క లుక్ విషయంలో కొంత మార్పు అవసరమని కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిరుతో పాటు అనుష్క మరో స్టార్ హీరోతో కూడా జోడీ కట్టాలని చాలా కాలంగా కోరుకుంటోంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన అనుష్క, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో కూడా స్క్రీన్ షేర్ చేసే ఛాన్స్ రాలేదు. ఒకసారి మీడియా ముందే "పవన్ కల్యాణ్‌తో నటించే కోరిక ఉంది" అని చెప్పింది. ఈ కాంబో కూడా త్వరలోనే నిజం కావచ్చన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఇది ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందన్న సంకేతాలు ఇచ్చింది. పోస్టర్ కట్ అభిమానుల్లో హై వోల్టేజ్ ఎగ్జైట్మెంట్ రేపుతోంది. దీంతో, 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ మానియాను మరోసారి నిరూపించనున్నాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరు-అనుష్క కాంబినేషన్ ఫైనల్ అయితే మెగా అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి 158వ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తుండగా, దానికి అనుష్క జోడీ అయితే హైప్ మరింత రెట్టింపు అవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో వశిష్ఠ, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తూ చిరు కొత్త జానర్స్‌కి వెళ్ళడం విశేషం. 'విశ్వంభర' లాంటి సోషియో-ఫాంటసీ సినిమాను ఒకే ఒక్క మూవీ చేసిన డైరెక్టర్ వశిష్ఠతో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీతో ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టులకు తోడు ఇప్పుడు బాబీతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లైన్‌లో పెట్టడం మెగా అభిమానులకు డబుల్ ధమాకా అనిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో, ప్రత్యేకంగా తెలుగు సినిమాలో 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఇంత క్రేజ్‌తో నిలబడటం చాలా అరుదైన విషయం. కొత్త హీరోలు వస్తూనే ఉన్నా, మెగాస్టార్ మానియా మాత్రం ఎప్పటికీ తగ్గలేదని చెప్పాలి. మెగాస్టార్ సినిమాలు వస్తున్న రిస్పాన్సే ఇందుకు నిదర్శనం.


Click it and Unblock the Notifications











