»   » కొత్త తమిళ రీమేక్ కై పోటీ: ఇటు చిరు..అటు ఎన్టీఆర్?

కొత్త తమిళ రీమేక్ కై పోటీ: ఇటు చిరు..అటు ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘వేదాలం' చిత్రం కేవలం అజిత్ కు ఉన్న క్రేజ్ తో భారీ ఓపినింగ్స్ తెచ్చుకుని నిలబడ్డ చిత్రం. ఈ చిత్రంపై ఇప్పుడు తెలుగు సినిమా హీరోల కన్ను పడింది. దీని రైట్స్ తీసుకుని పెద్ద హీరోల డేట్స్ సంపాదించాలని నిర్మాణ సంస్దలు ఉవ్విళ్లూరుతూంటే...మరో ప్రక్క హీరోలు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని చూసి తమకు సెట్ అవుతుందో లేదో అనే పనిలో పడ్డారట. ముఖ్యంగా ఎన్టీఆర్, చిరంజీవి ఈ సినిమాపై బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

గత కొద్ది రోజులు గా తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ మొదలైంది. చిరంజీవి రీసెంట్ గా అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాలం' కన్నుపడిందని. ఈ మేరకు ఆయన రీసెంట్ గా ఈ చిత్రం చూడటం జరిగిందని చెప్తున్నారు. తన 150 వ చిత్రంగా ఈ రీమేక్ ఎలా ఉంటుందని తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను స్పెషల్ గా షో వేయించుకొని మరీ చూశాడు. గతంలో కూడా ఎన్టీఆర్ తమిళ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయినట్టే కనిపించినా, సెట్స్ మీదకు మాత్రం రాలేదు. తాజాగా 'వేదలం' సినిమా విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ పై ఎన్టీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

Chiranjeevi and Ntr eye on Ajith movie ‘Vedalam’ ?

వేదాలం చిత్రం రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలతో, చెల్లి సెంటిమెంట్ తో సాగే చిత్రం అని తమిళ సినిమా వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఈ స్ధాయిలో సక్సెస్ అవటం చిరంజీవి, ఎన్టీఆర్ దృష్టి పడటానికి కారణమైందని అంటున్నారు.

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసింది. లాంగ్ రన్ లో వంద కోట్లు వసూలు చేయటం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Chiranjeevi and Ntr eye on Ajith movie ‘Vedalam’ ?

మరో ప్రక్క 'వేదలం' సినిమాను 'ఆవేశం' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగులో 'అఖిల్' రిలీజ్ ఉండటంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

ప్రస్తుతం రీమేక్ వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ పై డౌట్ ఏర్పడింద్. ఎన్టీఆర్ తో పాటు రీ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్ కూడా వేదలం సినిమా రీమేక్ పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో సినిమాకు ఎక్కువ రేటు చెప్పే అవకాసం ఉంది. మరి ఈ సినిమా ఆవేశంగా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందా..? లేకా రీమేక్ అవుతుందా..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
Now grapevine is about Chiru and Ntr is planning to choose “Vedalam”movie remake, even they requested for special screening of this movie to finalize on the same.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu