Don't Miss!
- News
YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
వాల్తేరు వీరయ్యలో శ్రీదేవి - చిరంజీవి: సినిమా మొత్తంలో మేజర్ హైలైట్ ఇదేనట
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్‌తో ప్రేక్షకులను అలరిస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఆయన.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. ఈ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోన్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న మెగాస్టార్ యమ స్పీడుగా చిత్రాలు చేస్తోన్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!
గత రిజల్ట్‌లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 154వ ప్రాజెక్టుగా 'వాల్తేరు వీరయ్య'ను చేస్తోన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా వరకూ పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణతో పాటు కొన్ని కీలకమైన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను నుంచి ఓ అదిరిపోయే న్యూస్ లీకైంది.

ప్రస్తుతం ఫారెన్‌లో 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించిన పాటల షూటింగ్ జరుగుతోంది. ఇందులో చిరంజీవి - శృతి హాసన్ మధ్యన సూపర్బ్ డుయెట్ పెట్టారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాట 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవిని అవుతా' అంటూ సాగుతుందని తెలుస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశాడని సమాచారం. ఇక, మంచు ప్రాంతాల్లో దీన్ని షూట్ చేస్తున్నారని తెలిసింది. ఈ సాంగ్‌ను ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడట. ఇది సినిమాలోని ఓ మేజర్ హైలైట్ కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
బీచ్‌లో రెచ్చిపోయిన దీపికా పిల్లి: టాప్ కిందకు జరిపి హీటు పెంచేలా!

మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబోలో రాబోయే 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.