»   » మహేశ్‌ను పక్కనపెట్టి.. మురుగదాస్‌తో చిరంజీవి అలా అన్నాడట..

మహేశ్‌ను పక్కనపెట్టి.. మురుగదాస్‌తో చిరంజీవి అలా అన్నాడట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు మురుగదాస్‌లు తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో కలుసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ప్రత్యేక అంశం ఏమీ లేకపోయినా వీరి కలయిక వెనుక ప్రధానాంశంగా మారింది.

ప్రిన్స్, మురుగదాస్‌తో సరదాగా కాసేపు

ప్రిన్స్, మురుగదాస్‌తో సరదాగా కాసేపు

ప్రిన్స్ మహేశ్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లోని చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కుతున్నది. ఇదే స్టూడియోలో చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ జరుగుతున్నది. ఈ షూటింగ్ గ్యాప్‌లో చిరంజీవి పక్కనే షూటింగ్ చేస్తున్న మహేశ్, మురుగదాస్‌లను పలకరించాడు.

యూనిట్‌నకు చిరు అభినందన

యూనిట్‌నకు చిరు అభినందన

మహేశ్‌బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌కి సంబంధించిన సన్నివేశాలను చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారట. మహేశ్, మురుగదాస్ మాట్లాడిన చిరంజీవి సినిమా విశేషాలను ఆసక్తిగా తెలుసుకొన్నట్టు తెలిసింది.

ఆ రెండింటిక కథ మురుగదాస్‌దే

ఆ రెండింటిక కథ మురుగదాస్‌దే

గతంలో మురుగదాస్ తో చిరంజీవి 'స్టాలిన్' సినిమా చేశారు. రీసెంట్‌గా మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా కథ కూడా మురుగదాస్‌దే కావడం గమనార్హం.

మరో చిత్రం కోసం కథ సిద్ధం చేయండి

మరో చిత్రం కోసం కథ సిద్ధం చేయండి

ఖైదీ నంబర్ 150 ఘన విజయం తర్వాత మరో చిత్రంపై దృష్టిపెట్టిన చిరంజీవి విభిన్నమైన కథ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కోసం ఒక కథను సిద్ధం చేయమని మురుగదాస్ కి చిరంజీవి చెప్పారనే టాక్ వినిపిస్తున్నది.

English summary
Megastar Chiranjeevi, Maheshbabu, Murugadosss met recently at Annapurna Studio. In this occassion he asked to prepare a story for his next movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu