»   » ‘ఖైదీ నంబర్ 150’ : ఆ సీన్స్ కట్ నిజమే అని తేలింది , క్లైమాక్స్ గురించి కూడా నిజమవుతుందా?

‘ఖైదీ నంబర్ 150’ : ఆ సీన్స్ కట్ నిజమే అని తేలింది , క్లైమాక్స్ గురించి కూడా నిజమవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11న మెగా ఖైదీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించేశాడు. దీంతో ఇప్పుడు 'ఖైదీ నంబర్ 150' ని అన్ని రకాలుగా రెడీ చేసే పనిలో దర్శక,నిర్మాతలతో పాటు హీరో చిరంజీవి కూడా బిజీ అయిపోయారు. ముఖ్యంగా వీవీ వినాయక్, నిర్మాత రామ్ చరణ్ లు 'ఖైదీ నంబర్ 150' ని ఓ అధ్బుతంగా చెక్కే బాధ్యతను మెగాస్టార్ కే వదిలేశారని చెప్పుకుంటున్నారు.

సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు ఫైనల్ అవుట్ పుట్ చూసుకుని , అన్నీ సవ్యంగా తాము అనుకున్నట్లుగా ఉన్నాయనుకున్న తర్వాతే రిలీజ్ కు వెళ్తూంటారు సినీ పరిశ్రమలో పండినవాళ్లు. ముఖ్యంగా కథలో ఏమన్నా డీవియేషన్ వచ్చే ట్రాక్ లు ఉన్నాయా..పాటలు ప్లేస్ మెంట్ ఎలా ఉంది, కామెడీ పండుతోందా వంటి విషయాలు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటారు.

ఎందుకంటే ఒకసారి ధియోటర్లోకి వచ్చాక ..ఆ సీన్ బాగోలేదు..లెంగ్త్ ఎక్కువైంది వంటి కారణాలతో కోత పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ విషయం సీనియర్ హీరో, కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజివి కి స్పష్టంగా తెలుసు. ఈ నేపధ్యంలో ఆయన దగ్గరుండి ఎన్నో మార్పులు చేసారట. ఇంతకీ ఆయన చేసిన మార్పులు ఏమిటి... సినిమా ఇన్ సైడ్ టాక్ ఏంటి..అనే విషయమై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం...

 అతిధులు...

అతిధులు...

దాదాపు తొమ్మిది సంవత్సరాల సుదీర్గ విరామం తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో హైలైట్స్ గా - మెగాస్టార్ అభినయం, అతిధులుగా ఎంట్రీ ఇచ్చిన వారి పాత్రలు, ఇంటర్వెల్ బ్యాంగ్, రాజకీయ పరమైన డైలాగ్స్, మెగాస్టార్ డ్యాన్స్ లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

 ఓ వర్గం ప్రచారం

ఓ వర్గం ప్రచారం

ఖైదీ నెం.150 సెన్సార్ అయిన ద‌గ్గ‌ర్నుంచి సినిమా టాక్‌పై బ‌య‌ట ర‌క‌ర‌కాల వార్తలు మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సినిమా బాగా వ‌చ్చింద‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుంటే... మరో వర్గం మాత్రం అబ్బబ్బే...`సినిమా అవుట్ పుట్‌పై చిరంజీవి ఏమాత్రం సంతృప్తిగా లేడ‌ు`అని మ‌రో వ‌ర్గం ఊద‌ర‌గొడుతోంది. దాంతో అభిమానులు... అటు పాజిటీవ్ ఇటు నెగిటీవ్ టాక్ ల మ‌ధ్య ఊగిస‌లాడుతున్నారు.

 చిరంజీవే స్వయంగా

చిరంజీవే స్వయంగా

జడ్జిమెంట్ విషయంలో మెగాస్టార్ కింగ్ అని చాలా సార్లు ప్రూవ్ అవటంతో.... తన సినిమాకు దగ్గరుండి ఎడిటింగ్ చేయించి ఓ షేప్ కి తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని షాకింగ్ అప్ డేట్స్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతున్నాయి.

 కాంప్రమైజ్ కాకుండా తీసేసాడు

కాంప్రమైజ్ కాకుండా తీసేసాడు

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన ‘ఖైదీ నంబర్ 150' లోని అనవసరంగా అనిపించిన కామెడీ సీన్స్ అన్నింటికీ కత్తెర వేసారట. కథకు అడ్డుపడుతూ సాగే కామెడీ సీన్స్ బాగున్నా సరే.. చిరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ సినిమా కోసం ఆయా సీన్స్ ను తీసేసారని చెప్పుకుంటున్నారు.

 విడిగా ఈ ట్రాక్

విడిగా ఈ ట్రాక్


ఈ క్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృధ్వీకి సంబంధించిన అన్ని కామెడీ సీన్లను తొలగించినట్లు తెలుస్తోంది. విడిగా ఈ ట్రాక్ పేలేలా ఉన్నా...చిరంజీవి మాత్రం సినిమాకు ఇవి అడ్డం పడుతోందని ఫీలయ్యినట్లు చెప్పుకుంటున్నారు.

 కొన్ని సీన్స్ ని సైతం

కొన్ని సీన్స్ ని సైతం

ముఖ్యంగా చిరంజీవి ఎంట్రీ సీన్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, పాటలు అద్భుతంగా తెరకెక్కడంతో.. ఆ ఫ్లో కి అడ్డం పడకుండా ఉండటానికే చిరు కొన్ని సీన్స్ ని సైతం డిలీట్ చేయించారని సమాచారం. ఇవి తీసేసిన తర్వాత చూస్తే ఓ ప్లో గా సినిమా ఎక్కడా ఎగుడుదిగుడులు లేకుండా వెల్లిపోయిందంటున్నారు.

 అలాగే ఉంచేసారు

అలాగే ఉంచేసారు


ఇదే టైమ్ లో బ్రహ్మానందం రోల్, పోసాని కృష్ణమురళి పంచ్ లు బాగుండటంతో.. వాటిని అలాగే ఉంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చేస్తుండటం గమనార్హం. గతంలో బ్రహ్మీ, చిరుల కాంబినేషన్ లో వచ్చిన ట్రాక్ లు సూపర్ హిట్ అవటం కూడా ఈ ట్రాక్ ని యాజటీజ్ ఉంచటానికి కారణం అంటున్నారు.

 మరోసారి ఆలోచించి

మరోసారి ఆలోచించి


అయితే ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు బాగా పట్టేసారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చూసినా ఆయనదే హైలెట్ ట్రాక్, మెయిన్ టాక్ అవుతోంది. బ్రహ్మానందం అయితే పూర్తిగా బోర్ కొట్టి వెనకపడ్డాడు. ఈ నేపధ్యంలో ఫృధ్వీ ట్రాక్ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అంటున్నారు.

 కాస్త బాధపెడుతుంది

కాస్త బాధపెడుతుంది

ఈ విషయంలో మెగాస్టార్ జడ్జిమెంట్ ఎప్పుడూ మిస్ అవ్వలేదు కాబట్టి.. మూవీ యూనిట్ కూడా చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా, వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు.. ‘ఖైదీ నంబర్ 150' లోని కొన్ని కామెడీ సీన్స్ డిలేట్ అయిపోయాయనే న్యూస్ మాత్రం ఇప్పుడు కాస్త బాధపెట్టే విషయమే.

చిరు కోసమైనా

చిరు కోసమైనా

మరో ప్రక్క ఈ సినిమా చిరు ఫ్యాన్స్‌కి న‌చ్చేలా తీయ‌డంలో వినాయ‌క్ విజ‌య‌వంతం అయిన‌ట్టు టాక్‌. చిరుని చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయ్యేలా ఆయ‌న మేకోవ‌ర్ ఉండ‌బోతోంద‌ని, చిరు కోస‌మైనా ఈ సినిమా చూడాలి అన్న‌ట్టుగా ఖైదీ నెం.150ని తీర్చిదిద్దార‌ని చెప్పుకుంటున్నారు.

 ఎంట్రీ కేక

ఎంట్రీ కేక


ఎప్పటిలాగే చిరంజీవి ఎంట్రీ సీన్‌, 3 పాట‌లూ, ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌.. ఇవ‌న్నీ చాలా బాగా వ‌చ్చాయ‌ని, ఖైదీ నెం.150కి ఇవే ప్ల‌స్ పాయింట్స్ అని తెలుస్తోంది. పోసాని కృష్ణ‌ముర‌ళి పంచ్‌లు బాగా పేలాయ‌ని, బ్ర‌హ్మానందం పాత్ర‌ని మ‌రోసారి బ‌కరా చేసేశార‌ని, ఈ సినిమాలో బ్ర‌హ్మీ కామెడీ మాత్రం అంతంత మాత్రంగానే పండింద‌ని తెలుస్తోంది.

 ఛరిష్మాతో ..

ఛరిష్మాతో ..

అయితే ఈ సినిమా క్ల‌యిమాక్స్ మాత్రం అనుకున్నంత గొప్పగా లేదని వీక్‌గా ఉంద‌ని టాక్‌. అయితే మిగిలిన సినిమా అంతా చిరు త‌న చ‌రిష్మాతో న‌డిపించేశాడ‌ని, స్టెప్పులైతే ఇక చూసుకొనే ప‌నే లేద‌ని ఈ సినిమా ఆల్రెడీ చూసిన‌వాళ్లు చెబుతున్నారు. ఇంద్ర టైమ్‌లో చిరు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అంత‌కంటే బాగున్నాడ‌ని, చిరు లో గ్లామర్, ఛరిష్మా చాలు ఈ సినిమాని సూప‌ర్ హిట్ చేయటానికి అంటున్నారు.

English summary
Khaidi no 150... Inside talk is Vinayak Chiru asked the editors to scissor few forced comedy scenes which seem to be deviating from the main track of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu