చిరంజీవి - బాబీ మూవీ కథ లీక్: ఊహించని పాత్రలో మెగాస్టార్.. ఈ బడా ప్రాజెక్టులో మరో యంగ్ హీరో!

సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అందులో బాబీ అలియాస్ కేఎస్ రవీంద్రతో చేసే సినిమా కూడా ఉంది. ప్రకటించినప్పుడే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు చూద్దాం పదండి!

మెగా మల్టీస్టారర్‌తో బిజీగా చిరంజీవి

మెగా మల్టీస్టారర్‌తో బిజీగా చిరంజీవి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

వరుసగా రీమేక్‌లు.. వాళ్లిద్దరు ఫిక్స్

వరుసగా రీమేక్‌లు.. వాళ్లిద్దరు ఫిక్స్

'ఆచార్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఇది ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్‌తో కూడా ఓ సినిమా చేయనున్నారు. తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు.

 బాబీతో సినిమాను ప్రకటించిన చిరు

బాబీతో సినిమాను ప్రకటించిన చిరు

తాను ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాల జాబితాను గతంలోనే వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. అందుకు అనుగుణంగానే కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని 'ఉప్పెన' ఈవెంట్‌లో స్వయంగా వెల్లడించారాయన. ఇక, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. సరికొత్త పాయింట్‌తో ఇది రూపొందబోతుంది.

 పుట్టినరోజుకు అదిరిపోయే కానుకతో

పుట్టినరోజుకు అదిరిపోయే కానుకతో

ఆగస్టు 1 ఆదివారం డైరెక్టర్ బాబీ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని అతడికి సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిచారు. అంతేకాదు, బర్త్‌డే సందర్భంగా ఓ కానుకను కూడా అందించారు. ఈ విషయాన్ని బాబీనే స్వయంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు.

చిరంజీవి బాబీ మూవీ కథ బయటకు

చిరంజీవి బాబీ మూవీ కథ బయటకు


బాబీ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకూ అతడు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమా కూడా అదే మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందట. ఈ విషయాన్ని తాజాగా బాబీ కూడా రివీల్ చేసేశాడు.

Recommended Video

Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
ఈ బడా ప్రాజెక్టులో మరో యంగ్ హీరో

ఈ బడా ప్రాజెక్టులో మరో యంగ్ హీరో

బాబీ తెరకెక్కించే సినిమా హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందనుంది. చిరు హీరో పాత్ర చేస్తుండగా.. అభిమాని రోల్ కోసం మరో యంగ్ హీరోను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అంటే ఇది మల్టీస్టారర్ మూవీ అని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో మరి ఆ యంగ్ హీరో పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న దానిపై మాత్రం అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X