»   »  పార్టీ పెట్టమని చిరును ఆహ్వానించాం

పార్టీ పెట్టమని చిరును ఆహ్వానించాం

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరంజీవి రాజకీయ రంగప్రవేశం గురించి ఆయనకన్నా ఇతరులే ఎక్కువగా యోచిస్తున్నారు. సిపిఐ నారాయణ, సిపిఎమ్ రాఘవులు చిరంజీవి ప్రస్తావన తెచ్చీ తెచ్చీ అలిసిపోయారు. ఇపుడు తాజాగా బిఎస్పీ నాయకులు, బీసీ నాయకులు ఆ పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాజమండ్రిలో చిరంజీవి రాజకీయ రంగ ప్రస్తావన తెచ్చారు. బీసీలకు రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే విషయంలో చిరంజీవిని ఆహ్వానించామని చెప్పారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రత్యేక రాజకీయ పార్టీ తామే ఏర్పాటు చేస్తామన్నారు.

Read more about: chiranjeevi srija love marriage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X