twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సీఎం వద్దకు వెళ్దామంటూ బాలకృష్ణకు చిరు ఫోన్.. మాట ఇస్తునానన్న బాలకృష్ణ.. కానీ?

    |

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి నేతృత్వంలోని సినీ హీరోల బృందం గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో భేటీ కాబోతోంది. అయితే ఈ భేటీలో పాల్గొనవలసిందిగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణకు సైతం ఫోన్ చేశారని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

    మరోసారి భేటీ

    మరోసారి భేటీ

    చాలా కాలంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్లు సందిగ్ధత వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చిరంజీవి గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ దాదాపు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అన్ని విషయాలతోపాటు సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయం మీద కూడా చర్చలు జరిపామని అన్ని విషయాలకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు అని వెల్లడించారు. త్వరలోనే మరి కొంతమందితో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మరోసారి భేటీ కాబోతున్నా అని ఆయన వెల్లడించారు.

    బాలకృష్ణని ఫోన్ చేసి

    బాలకృష్ణని ఫోన్ చేసి

    అందులో భాగంగా గురువారం నాడు అంటే ఫిబ్రవరి 10వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు సినీ హీరోల బృందం వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆచార్య సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. అయితే గతంలో బాలకృష్ణ ఈ భేటీల వ్యవహారాల మీద ఒకటి రెండు సందర్భాలలో హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణని కూడా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం.

    అనవసర తలనొప్పులు

    అనవసర తలనొప్పులు

    అయితే బాలకృష్ణ తాను రాలేను అని సున్నితంగా తిరస్కరించారు అని తెలుస్తోంది. బాలకృష్ణ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ హిందూపురం పొలిటికల్ టూర్ పూర్తి చేసుకుని రావడంతో ప్రస్తుతానికి ఐసోలేషన్ లో ఉన్నానని అందుకే తాను రాలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ లో చెప్పినట్లు సమాచారం. అలాగే మీరు వెళ్లి భేటీ అయి ఒక మంచి శుభవార్త తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవిని బాలకృష్ణ కోరారు అని తెలుస్తోంది.

    అనవసర తలనొప్పులు

    అనవసర తలనొప్పులు


    అయితే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇప్పుడు జగన్ తో భేటీ అయితే అనవసర తలనొప్పులు, వివాదాలు ముసురుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని బాలయ్య సన్నిహిత వర్గాల సమాచారం. నిజానికి అఖండ విడుదల సమయంలో కూడా అఖండ నిర్మాతలు బాలకృష్ణ మీద ఒత్తిడి తీసుకు వచ్చారని మీరు ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడితే టికెట్ రేట్ల పెంపు విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వారు కోరినా సరే ఆయన దానికి ససేమిరా ఒప్పుకోలేదు అని సమాచారం.

    Recommended Video

    AP Movie Tickets Rates బలుపు వైసీపీ ఎమ్మెల్యేలదా? సినిమా వాళ్లదా? | Filmibeat Telugu
    చిరంజీవికి బాలకృష్ణ మాట

    చిరంజీవికి బాలకృష్ణ మాట

    అందుకే అఖండ ఆంధ్రప్రదేశ్ విషయంలో సుమారు కోట్ల రూపాయల షేర్ కూడా కోల్పోయినట్లు చెబుతున్నారు. అలాగే ఈ సమస్య మీద ఒక పరిష్కారం వచ్చే వరకు ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వను అని మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణ మాట కూడా ఇచ్చారని చెబుతున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎలా తేలనుంది అనేది.

    English summary
    Chiranjeevi Rings Up Balakrishna to invite ys jagan meet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X