»   »  వావ్.....మెగాస్టార్ చిరంజీవి సిక్స్ ప్యాక్!

వావ్.....మెగాస్టార్ చిరంజీవి సిక్స్ ప్యాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమా గత కొంత కాలంగా మీడియాలో హైలెట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించబోతున్నాడనే విషయం తప్ప.....ఇంకా ఏ విషయమూ అఫీషియల్ గా ఖరారు కాలేదు. ఈ సినిమా దర్వకుడు ఇతడే అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా ప్రచారంలో ఉన్న పేరు పూరి జగన్నాథ్.

ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ తన సినిమాల్లోని హీరోలను సిక్స్ ప్యాక్ బాడీతో చూపిస్తాడు. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా ఆయన సిక్స్ ప్యాక్ బాడీలో చూపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారని అంటున్నారు.

మెగాస్టార్ తో జోడీ కట్టబోయేది ప్రఖ్యాత నటి శ్రీదేవి అనే వార్త కూడా గత వారం రోజులుగా ప్రచారంలోకి వచ్చింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 1990 దశకం చివరిలో సుప్రీం హీరో చిరంజీవి, ఆనాటి అందాల నటి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్‌ను రిపీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

 Chiranjeevi six pack for 150th movie!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడనే విషయంలో తప్ప.....ఇతర ఏ విషయాల్లోనూ సరైన సమాచారం, క్లారిటీ లేదు. మెగా ఫ్యామిలీ హీరోలను ఈ విషయమై ఎప్పుడూ ప్రశ్నించినా....కథ ఓకే కాలేదు, త్వరలోనే అన్ని వెల్లడిస్తామని గత మూడేళ్లుగా విషయాన్ని నెట్టూకొస్తూ వస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ క్లోజ్ సోర్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ చిత్రానికి రామ్ చరణ్ ముఖ్య నిర్మాత కాగా... బండ్ల గణేష్, ఓ టీవీ ఛానల్ ఓనర్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారనే ప్రచారం సాగుతోంది. సదరు టీవీ ఛానల్ ఓనర్ ఎవరు? అనేది ఇంకా బయటకు రాలేదు.

మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం....రచయిత బివిఎస్ రవి ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం పూరి జ్యోతిలక్ష్మి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారని, చిరంజీవి 150వ సినిమా కోసం పూరి కూడా ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఇలా రకరకాల వార్తలు, రకరకాల ప్రచారాలు అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప....ఈ అయోమయానికి తెరపడే అవకాశం కనబడటం లేదు.

English summary
Megastar Chiranjeevi developing Six Pack body for his 150th movie.
Please Wait while comments are loading...