»   » మెగా ఫ్యాన్స్ కు శభవార్త : 3D లో చిరంజీవి చిత్రం

మెగా ఫ్యాన్స్ కు శభవార్త : 3D లో చిరంజీవి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాభిమానులకు ఇది శుభవార్తే. ఆయన త్వరలో 3D లో అలరించబోతున్నట్లు సమాచారం. అయితే అది 150 వ సినిమాకు కాదు. ఆయన గతంలో నటించి సూపర్ హిట్టైన జగదేక వీరుడు...అతిలోక సుందరి చిత్రాన్ని ఇప్పుడు 3D ఫార్మెట్ లోకి మార్చి రీరిలీజ్ చేయాలని అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ తో ఈ చిత్రం సీక్వెల్ కూడా ప్లాన్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్యూటీ శ్రీదేవి జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి '. 1990 మే 9న విడుదలయిన ఈ చిత్రం తెలుగునాట ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్నా సినీ ప్రియుల మదిలో ఇంకా ఇది తాజా చిత్రంగానే మిగిలి ఉంది. తుఫాన్ ను సైతం లెక్కచేయకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది.

Chiranjeevi to entertain in 3D?

ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రంలోని ఏడు పాటలూ శ్రోతలను బాగా అలరించాయి. ముఖ్యంగా అబ్బనీ తియ్యనీ దెబ్బ వంటి పాటలు ఇప్పటికీ ఆ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

స్టెప్పులతో చిరంజీవి అలరిస్తే దేవకన్యగా శ్రీదేవి, దుష్ట మాంత్రికుడుగా అమ్రిష్ పురి నటన ఈ చిత్రానికే హైలెట్. ఈ చిత్రానికి కురిసిన ప్రశంసల జల్లులో దర్శకుడు రాఘవేంద్రరావు తడిసి ముద్దయ్యారు. ఇక స్వర్గీయ జంధ్యాల రాసిన మాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి.

150 వ చిత్రం విషయానికి వస్తే...

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు.

Chiranjeevi to entertain in 3D?

ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు. సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

English summary
It is coming out that Chiranjeevi will soon entertain in 3D. Ashwini Dutt is planning to re release Jagadeka Veerudu Atiloka Sundari film in 3D format.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu