»   » 20 నుంచి 3 నిముషాలకు ట్రిమ్ చేసిన చిరంజీవి

20 నుంచి 3 నిముషాలకు ట్రిమ్ చేసిన చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటిస్తున్న 'బ్రూస్‌లీ' చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆయన కేవలం 3 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

అయితే మొదటి నుంచి పదిహేను నుంచి ఇరవై నిముషాల సేపు తెరపై కనపడతారనే వార్తలు వినపడ్డాయి. అందుతున్న సమాచారం ప్రకారం రచయిత కోన వెంకట్ సైతం ఇరవై నిముషాల సేపు సాగే పాత్రను క్రియేట్ చేసారని తెలుస్తోంది. అయితే చిరంజీవి కల్పించుకుని ఈ చిత్రం తన 150 వ చిత్రానికి టీజర్ లా ఉండేలే కాని ఇక్కడ ఎక్కువ సేపు కనపడటానికి వీల్లేదని ఆ పాత్రను ట్రిమ్ చేసినట్లు సమాచారం. దాంతో చిరుపై అనుకున్న పాట, డాన్స్ రెండింటిని తీసేసారని చెప్పుకుంటున్నారు.

Chiranjeevi Trimmed from 20 Mins to 3 Mins


చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత తమ ప్రాజెక్టులో పనిచేయడంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 'బ్రూస్‌లీ' గీతాలను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నారు.

ఇక అనుకొన్న సమయానికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రామ్ చరణ్ పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఆయన అలుపెరగకుండా ఏకధాటిగా 17 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బ్రూస్‌లీ' తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'మెగా మీటర్‌...' అనే పాటని తెరకెక్కించారు రీసెంట్ గా. ఆ పాట కోసమే రామ్‌చరణ్‌ ఏకధాటిగా 17 గంటలపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ విషయాన్ని చిత్రబృందం తెలిపింది. ఈ పాటలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిపాడుతోంది. డ్యాన్స్‌ చేస్తూ గాయపడ్డప్పటికీ చిత్రీకరణలో పాల్గొందట రకుల్‌. 'బ్రూస్‌లీ' పాటల్ని వచ్చే నెల 2న, సినిమాని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్న చిరంజీవి నిన్నటినుంచే సెట్స్‌లోకి అడుగుపెట్టారు.

English summary
Chiru's 150th film hasn't yet started, he don't want this cameo to be a major role kind of and hence he has decided to cut the whole length of his presence to mere 3 minutes.
Please Wait while comments are loading...