twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోదీని కలిసిన మోహన్ బాబు.. బ్యాక్ గ్రౌండ్‌లో చిరంజీవి, జగన్! సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు

    |

    భారత ప్రధానితో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు భేటీ కావడం ప్రస్తుతం హాట్ ఇష్యూగా మారింది. ఇలా మోహన్ బాబు సడెన్‌గా ప్రధానితో భేటీ కావడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు జనం. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు భేటీ వెనుక చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందనే టాక్ ముదిరింది. ఆ వివరాలు చూద్దామా..

    ఫ్యామిలీతో పాటు మోహన్ బాబు.. మోదీతో మీట్

    ఫ్యామిలీతో పాటు మోహన్ బాబు.. మోదీతో మీట్

    మంచు మోహన్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ప్రధాని మోడీని కలిశారు. మోహన్ బాబు వెంట కుమారుడు విష్ణు, కూతురు లక్ష్మితో పాటు కోడలు విరోనిక కూడా ఉన్నారు. వీళ్లంతా కలిసి మోదీతో భేటీ అయిన పిక్స్ ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తున్నాయి.

    మోహన్ బాబు జంప్.. అందుకే..

    మోహన్ బాబు జంప్.. అందుకే..

    మరోవైపు ఈ ఫొటోలు బయటకు రాగానే.. మంచు మోహన్ బాబు బీజేపీలో చేరబోతున్నారని, అందుకే ఆయన మోదీతో సమావేశమయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ దీనిపై మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. ప్రధానిని కలవడం వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని.. కేవలం తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు ఆయన తెలిపారు.

    తెరపైకి వచ్చిన రాజకీయ కోణం.. దీని వెనుక

    తెరపైకి వచ్చిన రాజకీయ కోణం.. దీని వెనుక

    బాలీవుడ్‌ నటులతోనే భేటీ అవుతున్నారు.. దక్షిణాది నటులను కూడా కలవండి సర్ అని మోదీని కోరగా, త్వరలోనే సౌత్ సినిమా వాళ్ళను కలుస్తానని మోదీ మాటిచ్చినట్లు తెలిపారు మోహన్ బాబు. ఇదిలా ఉండగానే తాజాగా ఈ భేటీ వెనుక ఉన్న మరో రాజకీయ కోణం తెరపైకి వచ్చి హాట్ హాట్ చర్చలకు తావిస్తోంది. ఏపీ రాజధాని విషయంలోనే మోదీతో మోహన్ బాబు సమావేశం జరిగిందని చెప్పుకుంటున్నారు జనం.

     మోహన్ బాబుకు చిరంజీవి సలహా

    మోహన్ బాబుకు చిరంజీవి సలహా

    అంతేకాదండోయ్.. మోహన్ బాబుకు మోదీని కలవమని చిరంజీవి సలహా ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. ఏపీ రాజధాని విషయంలో జగన్ ప్రతిపాదనను చిరంజీవి సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని మోదీ వరకు తీసుకెళ్లారని, అందుకే మోహన్ బాబు- మోదీ భేటీ జరిగిందని చర్చలు ముదిరాయి.

    విశాఖ రాజధానిగా మారితే.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని

    విశాఖ రాజధానిగా మారితే.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని

    విశాఖ రాజధానిగా మారడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మతమే అనే సమాచారం మోదీకి తెలిపేందుకే మంచు మోహన్ బాబు ప్రధాని వద్దకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి. విశాఖ రాజధానిగా మారితే సినీ ఇండస్ట్రీకి సైతం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని ప్రధాని దృష్టికి మోహన్ బాబు తీసుకెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. ఫైనల్‌గా ఈ భేటీ ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    English summary
    Actor and YSRCP leader Manchu Mohan Babu and his family called on Prime Minister Narendra Modi in Delhi on Monday. On This Meet there are so many rumors come out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X