»   » ఛార్మి ఎఫెక్ట్ : చిరు 150వ చిత్రం దర్శకుడు మార్పు?

ఛార్మి ఎఫెక్ట్ : చిరు 150వ చిత్రం దర్శకుడు మార్పు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు అని ఖారరు అయిన ఈ సమయంలో ...ఆయన్ని మార్చారంటూ వార్తలు వచ్చి అభిమానులను కలవరపెడుతున్నాయి. దీనికి కారణం ..ఛార్మితో పూరి చేసిన జ్యోతి లక్ష్మి చిత్రం వర్కవుట్ కాకపోవటమే అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ...పూరి ని కాదనుకుని వివి వినాయిక్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు వినాయిక్ తో చర్చించినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాని ప్రకారం... ఇటీవల ఛార్మితో పూరి రూపొందించిన 'జ్యోతిలక్ష్మీ' చిత్రాన్ని చూసిన తర్వాత 150వ చిత్రానికి పూరితో కాకుండా వినాయక్‌తో వెళ్తే బెటరని చిరు అనుకున్నారని తెలిసింది. అంతేకాదు వినాయక్‌తో ఓ రోజంతా చర్చించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.

 Chiru’s 150th film with Puri doubtful?

చిరుతో తను చేసే 150వ చిత్రానికి కథ రెడీ అయ్యిందని, ఇప్పడికే పస్టాఫ్‌ని చిరు పక్కాగా ఓకే చేశారని కూడా పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ పరంగా చిరు 150వ చిత్రం షూటింగ్‌కి ఇంకా రెండు నెలల వ్యవధి ఉండటంతో, ఈ గ్యాప్‌లో నితిన్‌తో సినిమా చేయాలని పూరి డిసైడ్‌ అయిపోయి, నితిన్‌తో సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించేశాడు.

అయితే కొద్ది రోజుల క్రితం నితిన్‌తో కాదు వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నానంటూ పూరీ మళ్ళీ ప్రకటన చేశారు. అంతేకాదు...ఇలా హటాత్తుగా ఉన్నట్టుండి హీరో మారిపోవడానికి, ప్రాజెక్ట్‌ కూడా వేరే బ్యానర్‌కి వెళ్ళిపోవడానికి ఛార్మినే కారణమంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఛార్మి ట్విట్టర్‌ ద్వారా నితిన్‌కి క్షమాపణలు చెప్పింది కూడా.

అయితే తమ దగ్గర డబ్బుల్లేకపోవడం వల్లే నితిన్‌ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే తప్ఫుడు ప్రచారాన్ని ఛార్మి చేసినందుకు, తమకెంతో నష్టం వాటిల్లిందని, పరిశ్రమలో తమ సంస్థకి ఉన్న గౌరవం మంటగలిసిందని నితిన్‌ ఫాదర్‌ ఎన్‌.సుధాకర్‌రెడ్డి ఛాంబర్‌లో ఛార్మిపై ఫిర్యాదు చేయడమే కాకుండా, పరువునష్టం కింద యాభై కోట్లు డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

English summary
It is now doubtful if Puri Jagannadh will direct Chiranjeevi in the latter's 150th film. Maybe, VV Vinayak will direct Chiru after all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu