»   » పవన్ ను ఆహ్వానించిన వదినమ్మ.... ఇప్పుడైనా వస్తాడా..?

పవన్ ను ఆహ్వానించిన వదినమ్మ.... ఇప్పుడైనా వస్తాడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ వస్తున్నాడా..? మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఏదిజరిగినా మొదత వినబడే ప్రశ్న. కొన్నేళ్ళుగా మెగా బేదర్స్ మధ్య విభేదాలున్నాయన్న మాట ఇప్పటి వరకూ ఓపెన్ సీక్రేట్ గా నే ఉండిపోయింది. అదపాదడపా అన్నదమ్ములిద్దరూ కలిసి పోతున్నట్టే కనిపించినా దూరం దూరం గానే ఉండిపోయింది. ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరోసారి మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలను బహిర్గతం చేసినట్లే కనిపిస్తోంది.

ఈ ఫంక్షన్‌కు చిరు తమ్ముడు పవన్‌కల్యాణ్ వస్తాడా లేదా అనే ప్రశ్న తాజాగా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే మెగా ఫ్యామిలీలో ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తుండటంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఇటీవల రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ ''బాబాయ్‌ని పిలుస్తామని... రావడం రాకపోవడం ఆయనిష్టమని తేల్చేశాడు. ఈ ఒక్క మాటతో చరణ్ ఆగితే బాగానే ఉండేది. ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా అని కామెంట్ చేయడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


chiru wife sureka has invited pawan kalyan to Khaidino150 Prerelease event

అల్లు అరవింద్ కూడా పవన్ ఇక్కడుంటే తప్పకుండా వస్తాడని ప్రకటించాడు. అయితే ఈ డైలమాలో ఉండగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. పవన్ కోసం చిరు భార్య సురేఖ స్వయంగా అతనింటికెళ్లి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సతీమణి సురేఖ ఎప్పుడూ నవ్వుతూ ఆ కుటుంబ భాధ్యతలు తీసుకోవటం తప్ప ఏ వేదిక మీద కూడా నాలుగు మాటలు మాట్లాడరు. అసలు సినిమా వేరూ. నా కుటుంబం వేరూ అన్నట్టుగా ఉంటుంది మెగా అభిమానుల వదినమ్మ. అలాంటిది ఇప్పుడు ఆమే స్వయంగా అడిగితే పవన్ రానంటాడా? . పవన్ పలు సందర్భాల్లో ఆమె తన తల్లిలాంటిదని చెప్పాడు. మరి అలాంటి తల్లి పిలిస్తే వెళ్లకుండా ఉండడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పవన్ తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నారు.


ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం.150 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఓ ఊపుఊపేస్తున్నాయి. ఆడియో ఫంక్షన్ లాంటిదేమీ లేకుండా పాటలను డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గుంటూరు, విజయవాడ హైవే సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో జనవరి 7న నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్‌ను ఘనంగా చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

English summary
Megastar chiru wife sureka has invited pawan kalyan to Khaidino150 Prerelease event. everyone is awaiting for presence of pawankalyan at the prerelease event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu