»   » కొరియోగ్రాఫర్ డైరక్షన్ లో పవన్ నెక్ట్స్ ?

కొరియోగ్రాఫర్ డైరక్షన్ లో పవన్ నెక్ట్స్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అందరి టెక్నీషియన్స్ కు కోరికే. అయితే అది కొందరికే నెరవేరుతుంది. అలాగే కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ కు కూడా పవన్ ని డైరక్ట్ చేయాలని కోరిక. త్వరలో అది నిజం కాబోయే అవకాసాలు కనిపిస్తున్నాయి . జాని మాస్టర్ రీసెంట్ గా పవన్ కు ఓ కథ వినిపించాడు. కథ నచ్చడంలో పవన్ ఎవరైనా ప్రోడ్యూసర్ ని కలవమన్నాడని సమాచారం. దాంతో ఈ సినిమాను దాసరి నారాయణరావుని కలిసి కథ చెప్పారని, ఆయన నిర్మించే అవకాశం కనబడుతోంది.

రేసు గుర్రం,జులాయి, రచ్చ, ఎవడు లాంటి పెద్ద సినిమాలకు జానీ కొరియోగ్రాఫర్ గా పని చేసి విజయం సాదించాడు. ఇప్పుడు పవన్ ను డైరక్ట్ చేసి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కనుక నిజం అయితే సర్థార్ తర్వాత ఈ సినిమా ఉండవచ్చు అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 Choreographer Jaani Master to direct Pawan Kalyan?

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ కోసం గుజరాత్ కు వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో.

ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు 'సర్దార్‌' పెట్టి ఫస్ట్ లుక్ , టీజర్ వదిలారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా చిత్రం రూపొందిస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు. 'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

English summary
Choreographer, Jaani Master may very soon direct Pawan Kalyan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu