»   » చరణ్ ‘రచ్చ’లోనూ స్త్రీలను కించపరిచే సీన్లు తప్పవా?

చరణ్ ‘రచ్చ’లోనూ స్త్రీలను కించపరిచే సీన్లు తప్పవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు పోసాని కృష్ణ మురళి సినిమాల్లో అభ్యంతరకరమైన సీన్లు, బూతులను తలపించే డైలాగులు ఏ రేంజ్‌లో ఉంటాయో మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు. అతని దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు స్త్రీలకు మద్దతుగా ఉన్నట్లు కనిపించినా...వారిని కించ పరిచే విధంగా కొన్ని సీన్లు ఉంటాయనే విమర్శలు కూడా ఉన్నాయి. మెంటల్ కృష్ణ ఆ కోవలోనిదే అంటూ కొందరు ఆ మధ్య గగ్గోలు పెట్టారు కూడా.

రామ్ చరణ్ 'రచ్చ" సినిమాలోనూ ఇలాంటి సీన్లు తప్పవేమో? అనే పుకాఃర్లు షికార్లు చేస్తున్నాయి. పోసానికి, రామ్ చరణ్ రచ్చకు సంబంధం ఏమిటంటే...రచ్చ సినిమా దర్శకుడు సంపత్ నంది పోసాని శిష్యుడు కావడమే ఈ పుకార్లకు మూలం. ఇంత కాలం పోసాని వద్ద శిష్యరికం చేసిన సపంత్ కు గురువు లక్షణాలు బాగా ఒంటబట్టాయనే వారు లేక పోలేదు. సంపత్ నంది దర్శకత్వంలో ఇది వరకు వచ్చిన 'ఏమైంది ఈ వేళ" సినిమాలో అమీర్ పేట హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు 'కారెక్టర్ లెస్" అనే చందంగా చూపించడమే ఇందుకు కారణం.

సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ రచ్చ వస్తుండటంతో కొందరు ఆ...కోణంలో అనుమాన పడుతున్నారు. అయితే చిరు తనయుడు అలాంటోడు కాదు, సంపత్ నంది అలాంటి సీన్లు పెట్టాలని చూసినా చరణ్ ఒప్పుకోడు, అలాంటి సీన్లు అస్సలు ఉండవు అని మెగా అభిమానులు భరోసా ఇస్తుండటం గమనార్హం. మరి 'రచ్చ" చేయబోయే రచ్చ ఏ టైపులో ఉంటుందో? వెయింట్ అండ్ సీ.

English summary
Buz is that Ram Charan up coming movie rachcha nay having Clichéd scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu