»   » మహేష్, బన్నీ ఇద్దరికీ ఒకటే సమస్య..ఏం పరవాలేదు..!

మహేష్, బన్నీ ఇద్దరికీ ఒకటే సమస్య..ఏం పరవాలేదు..!

Subscribe to Filmibeat Telugu
అది చిన్న సమస్యే, ఏం పరవాలేదు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. తొలిసారి మహేష్ బాబు తొలిసారి ఇలాంటి పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మిలటరీ ఆపరేషన్, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు అద్భుతమైన కథలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మొదట విడుదల తేదీల విషయంలో సందిగ్దత నెలకొంది. నిర్మాతలు కూర్చుని చర్చించుకోవడంతో సమస్య తీరిపోయింది. కానీ ఈ రెండు చిత్రాలకు కామన్ గా చిన్న సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్

ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. భరత్ అనే నేను చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ లో మహేష్ పేల్చినా డైలాగ్స్ ఓ ఎత్తైతే, ముఖ్యమంత్రిగా మహేష్ కిల్లింగ్ లుక్స్ మరో ఎత్తు. కొరటాల రూపొందిస్తున ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మిలటరీ అధికారిగా బన్నీ

మిలటరీ అధికారిగా బన్నీ

అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో ఆర్మీ మాన్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడువులైన టీజర్ లో బన్నీ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు బలంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.

పవర్ ఫుల్ కథలతో

పవర్ ఫుల్ కథలతో

ఈ రెండు చిత్రాలు బలమైన కథలతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యంలో కొరటాల శివ భరత్ అనే నేను చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా మలచబోతున్నారు. ఇక ఆర్మీ మాన్ గా అల్లు అర్జున్ బోర్డర్ లో చేసే సాహసాలతో నా పేరు సూర్య చిత్రం ఉండబోతోంది.

విడుదల తేదీ సమస్య తీరింది

విడుదల తేదీ సమస్య తీరింది

ఈ చిత్రంలో నెలకొన్న విడుదల తేదీ సందిగ్దత వైదొలిగిన వైదొలిగిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న, నా పేరు సూర్య చిత్రం మే 4 న ఘనమైన విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

 చిన్న సమస్య

చిన్న సమస్య

ఈ రెండు చిత్రాలకు కామన్ గా ఓ చిన్న సమస్య వేధిస్తోందట. భరత్ అనే నేను చిత్రంలో మహేష్, కైరా అద్వానీ మధ్య చాలా తక్కువ సన్నివేశాలు ఉంటిని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇక నా పేరు సూర్య చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, బన్నీ మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. వాటిని తగ్గించాలని బన్నీ డైరెక్టర్ కు సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కథ బలంగా ఉంటె సినిమాలో ఈ చిన్న లోపాలు పెద్దగా కనిపించవు. ఈ రెండు చిత్రాలు ఏ మేరకు వారి అభిమానులని మెప్పిస్తాయో విడుదలయ్యాకే తేలనుంది.

English summary
Common problem for Mahesh and Allu Arjun movie. It is minor problem only
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu