»   » శ్రీదేవి చివరి క్షణాలపై షాకింగ్ రిపోర్ట్స్: ఆ పని చేసింది... హోటల్ సిబ్బందా? బోనీ కపూరా?

శ్రీదేవి చివరి క్షణాలపై షాకింగ్ రిపోర్ట్స్: ఆ పని చేసింది... హోటల్ సిబ్బందా? బోనీ కపూరా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's last moments Confusion : Who found Sridevi's unconscious

అతిలోక సుందరి శ్రీదేవి చివరి చూపు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. దేశ వ్యాప్తంగా మీడియా ఫోకస్ అంతా శ్రీదేవి విషాదం మీదనే ఉంది. ప్రజలు, అభిమానులు కూడా ఇందుకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శ్రీదేవి అంత్యక్రియలు టీవీల్లో అయినా చూడాలని, చివరి చూపు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు ఎందరో. అయితే శ్రీదేవి మరణించే చివరి క్షణాల్లో ఏం జరిగింది? అనే విషయంలో ప్రతి ఒక్కరిలోనూ అమయోయం నెలకొని ఉంది.

పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్

పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్

శ్రీదేవి గుండెపోటుకు గురైంది దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ అనే హోటల్‌లో. ఈ హోటల్‌లోనే ఆమె బస చేశారు. ఆమె మరణానికి ముందు హోటల్‌లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై.... పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్ ప్రచారంలో ఉన్నాయి.

 ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం

ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆంగ్ల పత్రిక ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం.... బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషి, మరికొందరితో కలిసి ఇండియా తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి బస చేసిన హోటల్ చేరుకుని ఆమెను సర్ ప్రైజ్ చేశారు. శ్రీదేవి, బోనీ ఇద్దరూ కలిసి కొంత సేపు మాట్లాడుకున్నారు. తర్వాత కలిసి డిన్నర్ చేద్దామనుకున్నారు. శ్రీదేవి ప్రెషప్ కావడానికి బాత్రూం వెళ్లారు. 15 నిమిషాలైనా ఆమె తిరిగి రాక పోవడంతో బోనీ వెళ్లి చూడటంతో ఆమె బాత్‌టబ్ లో చలనం లేకుండా పడిపోయి ఉన్నారు.

9 గంటలకు పోలీసులకు

9 గంటలకు పోలీసులకు

ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం....శ్రీదేవి చలనం లేకుండా పడిపోయి ఉండటంతో బోనీ వెళ్లి లేపడానికి ట్రై చేశాడు. ఆమె ఎంతకీ లేవక పోవడంతో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. వెంటనే దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. 9 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.

బోనీ కపూర్ ఆమె వెంట లేరంటూ...మిడ్ డే రిపోర్ట్

బోనీ కపూర్ ఆమె వెంట లేరంటూ...మిడ్ డే రిపోర్ట్

అయితే మిడ్-డే పత్రిక కథనం మరోలా ఉంది. శ్రీదేవిని బాత్రూంలో చలనం లేకుండా గుర్తించింది మొదట బోనీ కపూర్ కాదని, హోటల్ స్టాఫ్ అంటూ ఆ పత్రికలో వార్తలు వచ్చాయి.

చివరి క్షణాల్లో ఒంటరిగా శ్రీదేవి

చివరి క్షణాల్లో ఒంటరిగా శ్రీదేవి

హోటల్‌కు చెందిన ఓ ఉద్యోగి మిడ్ డే డైలీతో మాట్లాడుతూ...శ్రీదేవి చివరి క్షణాల్లో తన గదిలో ఒంటరిగానే ఉన్నారని వెల్లడించారు. హోటల్ సిబ్బంది చెప్పిన ఈ విషయం అందరినీ అయోమయంలో నెట్టి వేసింది.

 10.30 ప్రాంతంలో రూమ్ సర్వీస్‌కు కాల్ చేసిన శ్రీదేవి

10.30 ప్రాంతంలో రూమ్ సర్వీస్‌కు కాల్ చేసిన శ్రీదేవి

హోటల్ సిబ్బంది చెప్పినట్లు మిడ్ డే పత్రిక పేర్కొన్న కథనంలో..... 10.30 గంటలకు శ్రీదేవి డ్రింకింగ్ వాటర్ కోసం రూమ్ సర్వీస్ కు కాల్ చేశారు. 15 నిమిషాల్లో సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్నారు. పలుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా శ్రీదేవి నుండి రెస్పాన్స్ రాలేదు.

 అలారం మ్రోగించిన సిబ్బంది

అలారం మ్రోగించిన సిబ్బంది

అయితే శ్రీదేవి ఎంతకీ తలుపు తీయక పోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది ఎమర్జెన్సీ అలారం మ్రోగించారు. అనంతరం సిబ్బంది అంతా కలిసి రూమ్‌లోకి ఎంటయ్యారు. బాత్రూంలో శ్రీదేవి ప్లోర్ మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. అపుడు సమయం రాత్రి 11 గంటలు అవుతోందని సిబ్బంది తెలిపినట్లు మిడ్ డే పత్రిక పేర్కొంది.

అప్పటికీ శ్రీదేవి నాడి కొట్టుకుంటోంది

అప్పటికీ శ్రీదేవి నాడి కొట్టుకుంటోంది

హోటల్ సిబ్బంది శ్రీదేవిని చలనం లేకుండా గుర్తించే సమయానికి ఆమె నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెంటనే ఆమెను రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు గుర్తించారు.

 చనిపోయినపుడు బోనీ కపూర్ వెంట లేరా?

చనిపోయినపుడు బోనీ కపూర్ వెంట లేరా?

మిడ్ డే కథనం ప్రకారం.... ఆమె చనిపోయిన సమయంలో బోనీ కపూర్ వెంట లేరని, హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొనబడి ఉంది.

 అభిమానుల్లో అయోమయం

అభిమానుల్లో అయోమయం

అయితే మీడియాలో వస్తున్న విరుద్ధ కథనాలతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది. ఏది ఏమైనా శ్రీదేవి మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

English summary
Contradictory reports on Sridevi's last hours. Sridevi was in a room in the Jumeirah Emirates Towers Hotel when she breathed her last. Exactly what happened in the last few hours before the Rashid Hospital in Dubai declared Sridevi was 'brought dead' is yet to be ascertained.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu