Just In
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 1 hr ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 11 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- News
నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్‌కు లేఖ
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి - త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్: చివరికిలా డిసైడ్ అయ్యారన్న మాట
మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కాంబినేషన్లలో మెగాస్టార్ చిరంజీవి - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. టాలీవుడ్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉన్న వీళ్లిద్దరి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడా ప్రాజెక్టు గురించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
రీఎంట్రీలో దూకుడు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' మూవీ షూటింగ్ పూర్తవక ముందే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాదు, 'లూసీఫర్', 'వేదాళం' రీమేక్‌లతో పాటు బాబీ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనూ ఓ ప్రాజెక్టు చేయబోతున్నారట. తాజాగా దీని కోసం ఈ ఇద్దరూ భేటీ అయ్యారని ఓ న్యూస్ లీకైంది. ఆ సందర్భంలోనే చిరుకు ఓ లైన్ చెప్పాడట మాటల మాంత్రికుడు. అది ఆయనకు బాగా నచ్చడంతో వర్క్ చేయమని చెప్పాడట.

త్రివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీని తర్వాత ఆయన మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవితోనే చేయనున్నారని అంటున్నారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన మీటింగ్‌లో సైతం ఇదే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోన్న కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.