»   » అవికా గోర్ ఇక సినిమాలు చేయదా.? ఇలా ఎందుకు వెళ్ళిపోతోందంటే..

అవికా గోర్ ఇక సినిమాలు చేయదా.? ఇలా ఎందుకు వెళ్ళిపోతోందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తెరపై మెరిసిన కుర్రకథానాయికల జాబితాలో అవికా గోర్ పేరు కూడా కనిపిస్తుంది. 'ఉయ్యాలా జంపాలా' .. 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్స్ ఆమె ఖాతాలో వున్నాయి. ఆ తరువాత ఈ అమ్మాయి కొంత గ్యాప్ తీసుకుని అమెరికా వెళ్లింది. అక్కడ డైరెక్షన్లో డిప్లొమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుంది అవికా గోర్.

ఆ బుల్లితెర క్రేజ్‌తోనే 'ఉయ్యాల జంపాల'తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా 'సినిమా చూపిస్త మావ'. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... అవికా సినిమాలకి కొంత కాలం పాటు విరామం ఇవ్వాలనుకుంటోందట .

తెలుగులో :

తెలుగులో :

అవికాగౌర్ చిన్నప్పటి నుంచి నటిస్తోంది. టీవీ సీరియళ్ల ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. వృత్తి విషయంలో ఆమె చాలా డిసిప్లిన్డ్ గా వ్యవహరించేది. ఏనాడూ షూటింగ్ ఎగ్గొట్టడం కానీ, ఆలస్యంగా రావడం కానీ లేదు. తెలుగులో నటించడం ప్రారంభించిన తరువాత కూడా తను చేసే పనిలో ఏమాత్రం అశ్రద్ద చూపలేదు.

 మోడల్ గా, టీవీ నటిగా:

మోడల్ గా, టీవీ నటిగా:

ముంబాయి నుంచి హైదరాబాద్ కు తిరుగుతూ, నానా హైరానా పడుతూ కూడా నటిస్తూనే వచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాలో నటించేటప్పటికి ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. 1997లో పుట్టింది అవిక గౌర్. గుజరాతీ అయిన అవిక చిన్నప్పటి నుంచే మోడల్ గా, టీవీ నటిగా, అవిశ్రాంతంగా పని చేస్తూనే వచ్చింది.

చేదు అనుభవాలు :

చేదు అనుభవాలు :

దాంతో ఆమెకు ఈ బిజీబిజీ జీవితం మీద అవికా కి విసుగు పుట్టిందట. దీనికి తోడు ఆమెకు అటు ముంబాయిలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ చిన్న చిన్న చేదు అనుభవాలు తప్పలేదు.టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ఆమెను వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

 యంగ్ హీరో:

యంగ్ హీరో:

అశ్లీల పదాలు, అసభ్య సందేశాలను వాట్సాప్ ద్వారా పంపుతున్నాడట. ఇవి ఎవరు పంపుతున్నారో మొదట అర్థం కాలేదట. ఎవరో ఆకతాయి చేస్తున్న పని అనుకుందట. కానీ ఓ యంగ్ హీరో ఈ మెసేజ్ లు పంపుతున్నాడని తెలుసుకుని షాక్ కు గురైందట. ఈ విషయాన్ని తనకు మంచి మిత్రులైన సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, నిఖిల్, రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్ తో చెప్పుకుని బాధపడిందట.

 సినిమాను ఆపేయండి:

సినిమాను ఆపేయండి:

కొన్నాళ్ల క్రితం తను-నేను సినిమా చేస్తున్నపుడు అయితే, ఒక దశలో అప్పటికి సినిమాకు అయిన ఖర్చంతా ఇచ్చేస్తాను, సినిమాను ఆపేయండి..చేయను అని ఆమె నిర్మాతను రిక్వెస్ట్ చేసినట్లు వినికిడి. ఇంతలా అడగడానికి మరి ఆ సినిమాలో నటించిన ఒకరితో పొసగలేదనే గుసగుసలు వున్నాయి.

హీరోలు ప్రవర్తించే తీరు:

హీరోలు ప్రవర్తించే తీరు:

అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమలో పని చేయాలంటేనే విరక్తి కలుగుతోందని, తోటి నటీమణులతో హీరోలు ప్రవర్తించే తీరు ఏ మాత్రం బాగోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న విషయం. వాట్సప్ లో బూతు సందేశాలన్నీ తొలగించిన అవికా గోర్ కు ఆ "అడల్ట్" సందేశాలు పంపిన యువహీరో ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ ఏపిసోడ్ అవికాలో సినీ జీవితం పై ఉన్న విరక్తిని మరింతగా పెంచిందట.

అందరికీ దూరంగా:

అందరికీ దూరంగా:

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నదేమిటంటే, ఆమె అందరికీ దూరంగా ముంబాయిలో తను ఒక్కర్తే ప్రశాంతంగా వుంటోందని తెలుస్తోంది. ఇటీవల 18ఏళ్లు దాటి 19 రాగానే, మైనారిటీ తీరగానే తల్లితండ్రులకు కూడా దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ప్రశాంతంగా జీవించిన తరువాతే కెరీర్ పై మళ్లీ దృష్టి పెట్టడమా, ఏం చేయడమా? అన్నది డిసైడ్ చేసుకోవాలన్నది అవికా ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబాయిలోని ఒక ప్రాపర్టీని కూడా అవిక అమ్మేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రిచా గంగోపాధ్యాయ:

రిచా గంగోపాధ్యాయ:

ఇలాగే ఇదివరలోనూ ఇండస్ట్రీ నుంచి రిచా గంగోపాధ్యాయ ఎలా మాయమైపోయిందో అందరికీ తెలిసిందే. ఆఫర్లు లేవనుకుంటున్న టైమ్ లో మిర్చితో మాంఛి హిట్ కొట్టింది. ఇక ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయనుకున్న టైమ్ లో సినిమాలకు టాటా చెప్పేసింది. సినిమాల నుంచి తప్పుకుంటున్నాని సింపుల్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పడేసి... అమెరికా చెక్కేసింది. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటోంది.

తమిళ, మలయాళ ఆఫర్లు కూడా:

తమిళ, మలయాళ ఆఫర్లు కూడా:

ఇప్పుడు ఈ చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా అదే రూట్లో ఉందని తెలుస్తోంది. ఉయ్యాల జంపాల సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ హీరోయన్... లక్ష్మిరావే మాఇంటికి, సినిమా చూపిస్త మావ లాంటి సినిమాలతో విజయాలందుకుంది. ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ ఆఫర్లు కూడా సొంతం చేసుకుంటోంది. క్రేజ్ ఇలా పీక్ పొజిషన్ లో ఉన్న టైమ్ లో సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటోందట ఈ చిన్నది. ప్రస్తుతం తన వయసు తక్కువే కాబట్టి...

 మంచి పీక్ టైం లో తప్పుకొని:

మంచి పీక్ టైం లో తప్పుకొని:

కొన్నాళ్లు సినిమాలకు కామా పెట్టి... బుద్ధిగా చదువుకొని ఆ తర్వాత మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందట.అయితే ఇలా మంచి పీక్ టైం లో తప్పుకొని మళ్ళీ రీ ఎంట్రీ అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచం లో అలా వీలవుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న, సరిగ్గా ఆలోచించుకోని తన కెరీర్ని ఆనందంగా ఉండేలా మార్చుకోవాలని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు

English summary
Cute Actress Avika Gor is planning to quit films. It is heard that Avika has decided to concentrate on her studies first and make a comeback to screen after the studies are over.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu