»   » 'మనం' మళ్లీ : నాగ చైతన్య కామన్ ఫ్యాక్టర్

'మనం' మళ్లీ : నాగ చైతన్య కామన్ ఫ్యాక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని వారి కుటుంబ హీరోలు కలసి 'మనం'లో సందడి చేశారు. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబమూ ఓ సినిమా చేయబోతోంది. వెంకటేష్‌, రానా కలసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కథ సిద్ధమవుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమా గురించి రానా చెబుతూ ''బాబాయ్‌తో కలసి ఓ చిత్రంలో నటించబోతున్నా. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం కానుంద''న్నారు. మూవీ మొఘల్‌ డి.రామానాయుడు కలల చిత్రమిది. తన కుటుంబ సభ్యులతో కలసి ఓ చిత్రం రూపొందించాలని, అందులో వెంకటేష్‌, రానా, నాగచైతన్యలతో పాటు తానూ నటించాలని కలలు కనేవారు. ఇప్పుడు ఆయన కల ఇలా తీరబోతోందన్నమాట. దర్శకుడెవరనేది త్వరలో తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్...

Daggubati family is all set to do a Manam

పవన్ కళ్యాణ్ తో చేసిన 'గోపాల గోపాల' తరవాత వెంకటేష్‌ మరో కథకు పచ్చజెండా వూపలేదు. కొన్నాళ్లు ఆయన విశ్రాంతి తీసుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త కథలు వింటున్నారు. అందులో భాగంగా రవిబాబు చెప్పిన కథని వెంకీ ఓకే చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకీ, రవిబాబుకీ మంచి అనుబంధం ఉంది.

తాజా చిత్రం 'అవును 2' కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చినదే. ఇప్పుడు వెంకీతో చిత్రాన్ని కూడా ఆ సంస్థే తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ''త్వరలోనే ఓ స్టార్ హీరో తో ఓ యాక్షన్‌ చిత్రం చేయబోతున్నా'' అంటూ రవిబాబు కూడా హింట్‌ ఇచ్చేశారు. మరి ఈ కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అయితే వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరోని..రవిబాబు వంటి మోడ్రన్ ఐడియాలజీతో ఉన్న దర్శకుడు ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది.

నటుడిగా సినీ రంగానికి పరిచయమైనా... దర్శకుడిగా తనకంటూ ఓ శైలి సృష్టించుకొన్నారు రవిబాబు. 'అల్లరి', 'అనసూయ', 'నచ్చావులే', 'నువ్విలా' చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్నారు. హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాల్ని తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడు అనిపించుకొన్నారు. ఇప్పుడు 'అవును 2'తో మరోసారి భయపెడతానంటూ.... ఈ నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అనుకున్న స్ధాయిలో వర్కవుట్ కాలేదు.

అయితే రవిబాబు తో చాలా సుఖం ఉందని నిర్మాతలు అంటారు. ఆయన అనుకున్న బడ్జెట్ లోనే చెప్పినట్లు తీసి ఇవ్వగల టెక్నీషియన్. ''స్క్రిప్టు దశలోనే జాగ్రత్తపడితే బడ్జెట్‌ ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది. నేనెప్పుడూ ఒక్క షాట్‌ కూడా వృథాగా తీయను. అందుకే నా సినిమాలన్నీ అనుకొన్న వ్యయంలోనే పూర్తవుతాయి'' అంటారు రవిబాబు.

English summary
Rana tweeted in his twitter account saying that the script work is going on and soon the entire Daggubati family would be seen together on the celluloid just like in Manam and Kal Aaj aur Kal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu