Don't Miss!
- News
వందే భారత్‌ను తలదన్నే `హైడ్రోజన్ రైళ్లు` రానున్నాయ్: ఏపీలో ట్రయల్స్: రద్దీ మార్గాల్లో..!!
- Sports
భవిష్యత్తులో మూడు జట్లు.. టీమిండియాపై మాజీ లెజెండ్ కామెంట్స్
- Finance
Adani Group: శుభవార్త చెప్పిన గౌతమ్ అదానీ..! త్వరలోనే ప్రారంభం కానున్న 5 IPOలు..
- Automobiles
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Hit 4 హిట్ యూనివర్స్‌లోకి టాలీవుడ్ టాప్ హీరో.. దగ్గుబాటి వారసుడి 75వ సినిమాగా హిట్ 4?
ఇటీవల కాలంలో కొత్త తరహా దర్శకులు ఆలోచిస్తున్న విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. కేవలం హాలీవుడ్ లోనే కొనసాగుతున్న మల్టీ వర్స్ ట్రెండ్ ను ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా యువ దర్శకులు చాలా తెలివిగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగులో అయితే శైలేష్ కొలను కూడా అద్భుతమైన ఆలోచన విధానంతో సస్పెన్స్ థ్రిల్లర్ కథనాలతో ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలనే రెడీ అయ్యాడు. ఇటీవల హిట్ 2 సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు పార్ట్ 3 కూడా రెడీ చేస్తున్నాడు. అయితే హిట్ 4 కోసం ఒక అగ్ర హీరోను కూడా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హిట్ కేసులు సక్సెస్
యువ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను మొదటి సినిమా హిట్ తోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ అతను సీక్వెల్ గా హిట్ 2 సినిమాను తెరకెక్కించిన విధానం కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయింది. అందులో అడవి శేష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

హిట్ మూడవ కేసు
ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ అయిన తర్వాత మల్టీవర్స్ తరహాలో హిట్ యూనివర్స్ ఇంకా పెద్దగా క్రియేట్ చేయబోతున్నట్లుగా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని డిఫరెంట్ సినిమాలు వస్తాయని మల్టీస్టారర్ సినిమాలు కూడా ఉంటాయి అని ఈ దర్శకుడు నమ్మకంగా వివరణ ఇచ్చాడు. ఇక హీరో నానితో కూడా హిట్ 3 సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

హిట్ 4వ భాగం
హిట్
2
సినిమా
చివరలో
అర్జున్
సర్కార్
గా
నాని
కనిపించిన
విధానం
ఓవర్గం
ప్రేక్షకులను
ఎంతగానో
ఆకట్టుకుంది.
అలాగే
భవిష్యత్తులో
మరిన్ని
మల్టీవర్స్
కథలు
ఉంటాయని
చెప్పిన
దర్శకుడు
ముందుగానే
పార్ట్
4
కూడా
రెడీ
చేసుకున్నట్లుగా
తెలుస్తోంది.
హిట్
4వ
భాగానికి
సంబంధించిన
స్టోరీ
లైన్
గురించి
కూడా
ప్రముఖ
హీరోతో
చర్చించినట్లుగా
తెలుస్తోంది.

స్టార్ హీరో 75వ సినిమాగా
ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు వెంకటేష్ అని ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ ఇదివరకే హిట్ 2 స్పెషల్ షో కూడా వీక్షించడం జరిగింది. అయితే అతనితో పోలీస్ క్యారెక్టర్ చేయించాలి అని శైలేష్ ఆలోచించినట్లు సమాచారం. ఇటు 4 కు సంబంధించిన కథ గురించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక ఒకవేళ కథ ఫిక్స్ అయితే వెంకటేష్ 75వ సినిమాగా హిట్ 4 వచ్చే అవకాశం ఉందట. మరి ఈ విషయంలో ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

వెంకీ లాంగ్ గ్యాప్
ఇక
మరో
షాకింగ్
విషయం
ఏమిటి
అంటే..
వెంకటేష్
సోలో
హీరోగా
స్క్రీన్
పై
కనిపించిన
చాలా
రోజులైంది.
ముఖ్యంగా
2017
గురు
సినిమా
తర్వాత
ఆయన
సోలో
హీరోగా
చేసిన
సినిమాలు
బిగ్
స్క్రీన్
పై
విడుదల
కాలేదు.
ఆ
తరువాత
ఎఫ్
2,
వెంకీ
మామ
రెండు
మల్టీ
స్టారర్
సినిమాలు
థియేటర్లలో
విడుదలవగా..
సోలో
హీరోగా
చేసిన
రీమేక్
సినిమాలు
నారప్ప
దృశ్యం
2
ఓటీటీలో
విడుదలయ్యాయి.
ఇక
ఈ
ఏడాది
ఎఫ్
3
అనే
సినిమా
కూడా
మల్టీస్టారర్
కాగా
ఓరి
దేవుడా
సినిమాలో
ఆయన
గెస్ట్
పాత్రలో
కనిపించారు.
ప్రస్తుతం
సల్మాన్
ఖాన్
బాలీవుడ్
సినిమాలో
ఒక
ప్రత్యేకమైన
పాత్రలో
కనిపించబోతున్నారు.