»   » బాలయ్య కోసం లాబీయింగ్ చేస్తున్న దాసరి...!?

బాలయ్య కోసం లాబీయింగ్ చేస్తున్న దాసరి...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

2010 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నంది అవార్డ్ అందుకోవడం ఖాయమని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. 'సింహా" చిత్రంలో ప్రదర్శించిన అభినయానికి ఈ అవార్డు వస్తుందనుకుంటున్నారేమోననే అనుమానాలొస్తే ఆ సినిమాకి రాదనీ అనేస్తున్నారు. మరి 2010లో బాలకృష్ణది 'సింహా" మాత్రమే విడుదలైంది కదా అనే అనుమానాలు రావచ్చు. కానీ విషయం ఏమిటంటే బాలకృష్ణకి 'పరమవీర చక్ర" సినిమాతో నంది అవార్డు రావడం ఖాయమట. ఈ సినిమా విడుదలయింది ఈ జనవరిలోనే అయినా కానీ సెన్సార్ మాత్రం 2010లోనే చేయించేశారు.

సినిమా ఏ సంవత్సరంలో విడుదలైనా నంది అవార్డు ఇవ్వడానికి కన్సిడర్ చేసేది సెన్సార్ అయిన తేదీనే కాబట్టి ఆ విధంగా 'పరమవీర చక్ర" కి బాలయ్య నంది అందుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. అసలే దాసరి దర్శకుడు కాబట్టి నంది అవార్డు తెచ్చుకోవడం కూడా పెద్ద విషయమేమీ కాదు. 'మేస్త్రీ"లోని తన నటనకే ఉత్తమ నటుడి అవార్డు తెచ్చుకున్న దాసరి బాలకృష్ణకి నంది అవార్డు రావడానికి ఆమాత్రం లాబీయింగ్ చేయలేడా ఏంటి..?ఇప్పటికే బాలయ్య మనసు గెలుచుకునేందుకు ఆ ప్రయత్నాల్లో పడ్డ దాసరి అందుకే పదే పదే ఈ సినిమాకి జాతీయ అవార్డు వస్తుందని నొక్కి చెబుతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu