»   » తను ఎక్సపోజింగ్ బాగా చేస్తుందని మూడు సినిమాలలో బుక్ చేశారా..

తను ఎక్సపోజింగ్ బాగా చేస్తుందని మూడు సినిమాలలో బుక్ చేశారా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బికిని భామ దీక్షాసేథ్‌ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ 'వాంటెడ్" హీరోయిన్ అయ్యారు. ఇటీవల కాలంలో అతికొద్ది సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న నాయికల్లో ఈమె ఒకరు. 'వేదం" చిత్రంతో పరిచయమైన ఈ క్యూట్‌గాళ్, మిరపకాయ్, వాంటెడ్ చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించి కురక్రారులో వేడి పుట్టించారు. అందంతో పాటు అభినయం కూడా కలగలిసిన ఈ అందాల తారకు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఆఫర్లు వరిస్తున్నాయి.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మకు యువ కథానాయకుడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దీక్షాసేథ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. డాన్స్ మాస్టర్ మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్" పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చి మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. జె.భగవాన్, పుల్లారావు కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన నాయికగా చేస్తున్నారు.

'బిల్లా" చిత్రంలో ప్రభాస్‌తో జతకట్టిన అనుష్క ఆయనతో నటించడం ఇది రెండోసారి. 'రెబల్" చిత్రంలో అనుష్క అందాలతో పాటు దీక్షా గ్లామరస్ అభినయాన్ని కూడా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో దీక్షాసేథ్‌ని తీసుకోవడం జరిగిందన్నారు. కాగా దీక్ష ఈ చిత్రంతో పాటు మంచు మనోజ్ కుమార్‌తో 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా" అనే చిత్రంలోనూ, తమిళంలో జాతీయనటుడు అవార్డు పోందినటువంటి సీయాన్ విక్రమ్‌తో ఓ సినిమాలో నటించనున్నారని కూడా వినికిడి.

English summary
Hot actress Deeksha Seth has signed her next flick opposite Prabhas, which is titled as Rebal. J Bhagavan and Pullarao is producing the film under his own bannar. this movie is directed by Raghava Lawrence. Also, signed her next flick opposite Manchu Manoj, which is titled as Vuukodathara Ullikki Padathara. Manoj’s sister Lakshmi Manchu is producing the film under her home production banner Lakshmi Prasanna Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu