»   »  'గబ్బర్‌సింగ్-2' లో హీరోయిన్ గా ఆమెనే ?

'గబ్బర్‌సింగ్-2' లో హీరోయిన్ గా ఆమెనే ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'పవన్‌కల్యాణ్ గబ్బర్‌సింగ్-2' అనే పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిల్మ్‌చాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేశారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో దీపికా పదుకోని నటించే అవకాసం ఉందని సినీ వర్గాల సమాచారం.

సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్రీకరణ జరగనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈమేరకు దీపిక తో చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రీసెంట్ గా చెన్నై ఎక్సప్రెస్ సూపర్ హిట్ తో మంచి జోర్ మీదఉ న్న దీపిక చాలా ఎక్కువ రెమ్యునేషన్ చెప్తోందని వినికిడి. అయితే ప్రాజెక్టుకి బాగా క్రేజ్ వస్తుందని ఆమెనే తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంతకుముందు సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం.

నిజానికి 'గబ్బర్‌సింగ్' హిందీలో సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'దబాంగ్'కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన 'దబాంగ్-2' సైతం ఘన విజయం సాధించింది. అయితే 'గబ్బర్‌సింగ్-2' అనేది 'దబాంగ్-2'కు రీమేక్ కాదన్నది గమనార్హం. దర్శకుడు సంపత్ నంది తయారుచేసిన కథతో ఈ సినిమా రూపొందనున్నది. ఈ సినిమా కోసం పవన్ కలయన్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Deepika Padukone is being considered as the female lead opposite Pawan Kalyan in the star’s next 'Gabbar Singh' film. A source close to the project says, “Deepika is the front-runner for the female lead opposite Pawan in the 'Gabbar Singh' franchise; two others who are in the running are Sonakshi Sinha and Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu