For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదాల 'స్నేహి'తురాలు

  By Staff
  |

  'హోమ్లీ గర్ల్', 'బాపు బొమ్మ' లాంటి ముచ్చటైన పేర్లు తన సొంతం చేసుకున్న నాయిక స్నేహ కొత్తగా "వివాదాల స్నేహితురాలు" అన్న కొత్త బిరుదును కూడా తన సొంతం చేసుకోనుంది. ఈ మధ్యన వరుసగా వివాదల్లో చిక్కుకొంటూ వార్తల్లో నిలుస్తోంది మన బాపూ బొమ్మ. ఆ మధ్యన ఓ అభిమాని సెల్ ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశాలు పంపుతూ తనని పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన్ని కటకటాల పాలు చేసింది. ఆ తర్వాత తమిళనాడులోని తిరువన్నామళై గుడిలో చెప్పుల కాళ్లతో ప్రదక్షిణలు చేసి హిందూ సంఘం ఆగ్రహానికి గురయింది. తొలుత బెట్టు చేసినా తర్వాత తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పింది.

  తాజాగా కేరళలోని తిరుచ్చి పట్టణంలో ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన స్నేహ షాపులోనికి ప్రవేశిస్తుండగా అప్పటికే భారీ సంఖ్యలో గుమిగూడిన అభిమానులు ఆమెను చూడాలని ఎగబడ్డారు. ఇంతలో స్నేహ కెవ్వున కేక పెట్టింది. దీంతో ఆమె ప్రయివేట్ సెక్యూరిటీ, షాపు యాజమాన్యం కంగారు పడి, ఏమైందని ప్రశ్నించగా ఎవరో తన నడుముని గట్టిగా గిల్లాడని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా అదిగో ఆ నీలం చొక్కా వేసుకున్న వ్యక్తేనని నిర్ధారించేసింది. దీంతో అతగాడికి అక్కడున్న వారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతనో రియలెస్టేట్ వ్యాపారని, పేరు సురేష్ అనీ తేలింది. ఆ తర్వాత అతను బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతటితో వివాదం సమసిపోయిందనుకునేరు. అసలు కథ అక్కడే మొదలయింది.

  తన భర్త సురేష్ ను అకారణంగా అనుమానించి, చెయ్యని నేరానికి జైలుకు పంపించి తమ పరువు తీసిందని స్నేహ పై పరువు నష్టం దావా వేసింది ఆయన భార్య షర్మిళి. ఆ సంఘటన జరిగినప్పుడు తాను తన భర్త పక్కనే వున్నానని, తామిద్దరం స్నేహకు చాలా దూరంలో వున్నామని, తనని గిల్లిన వాన్ని గుర్తించడంలో స్నేహ పొరపాటు చేసిందని, దీంతో ఎంతో గౌరవంగా బ్రతుకున్న తమ పరువు బజారున పడిందని ఫిర్యాదులో పేర్కొంది. షర్మిళి డిమాండ్‌లో పూర్తి న్యాయం ఉందని పలువురు భావిస్తున్నారు. వందల సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు ఇటువంటి సంఘటనలకు కారణమైన వ్యక్తులను కచ్చితంగా గుర్తించడం చాలా కష్టమని కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు!

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X