»   » ఇలియానా తెలుగులో ఛాన్స్ కోసం మరీ ఇంతలా ..

ఇలియానా తెలుగులో ఛాన్స్ కోసం మరీ ఇంతలా ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇలియానా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్, ఎక్కువ రెమ్యునేషన్ సంపాదించే హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కాలం మారింది. ఆమె బాలీవుడ్ ప్రయాణం ఆమెకు ఇక్కడ వేషాలు లేకుండా చేసింది.


అక్కడే వరస పెట్టి సినిమాలు చేద్దామనుకుంటే ఆ అవకాసం రాలేదు. దాంతో తెలుగులోనే మళ్లీ సినిమా చేసి, ఇక్కడ బిజీ అవ్వాలనుకుంటోందని సమాచారం. ఆమెకు ఆలోచన ఉండటం వరకూ బాగానే ఉంది. కానీ ఈ గ్యాప్ లో చాలా మంది హీరోయిన్స్ ఇక్కడకి వచ్చి సెటిల్ అయ్యిపోయారు కదా..

ఈ నేపధ్యంలో ఆమెకు అవకాసం ఇచ్చే డైరక్టర్ ఎవరు. పోనీ ఆమెను కెరీర్ ప్రారంభంలో ఎంకరేజ్ చేసిన దర్శకులు ఫామ్ లో ఉన్నారా అంటే లేరు. వైవియస్
చౌదరి, పూరి జగన్నాధ్ ఇద్దరూ ప్రస్తుతం ఏ హీరో డేట్స్ ఇస్తారో వారితో ప్రారంభిద్దామనే డెస్పరేషన్ లో ఉన్నారు.

ఇందుకు ఉపాయం లేదా అని ఇలియానా ఆలోచించింది. రేటు తగ్గించి డిస్కౌంట్ ఇస్తే తను బిజీ అయ్యే అవకాసం ఉందని భావిస్తోంది. అందులో భాగంగా తన రెమ్యునేషన్ సగానికి సగం తగ్గించుకుంటున్నట్లు డైరక్టర్స్ కు , నిర్మాతలకు మేనేజర్ ద్వారా కబురు పెడుతున్నట్లు సమాచారం. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

ఇలియానా సూపర్ హిట్ , సూపర్ ఫ్లాఫ్ చిత్రాల లిస్ట్ ఇక్కడ చూడండి...

దేవదాసు

దేవదాసు

2006లో వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన దేవదాసు చిత్రంతో పరిచయమైంది. ఆ చిత్రం మంచి విజయమే సాధించింది.

పోకిరి

పోకిరి


పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. ఘన విజయం సాధించి రికార్డ్ లు తిరగరాసింది.

రాఖి

రాఖి

2006 లో ఎన్టీఆర్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆమె కెరీర్ లో కాస్తంత ఊపు తెచ్చింది.

జల్సా

జల్సా

2008 లో త్రివిక్రమ్ దర్సకత్వంలో వచ్చిన జల్సా చిత్రం ఫ్లాపుల్లో ఉన్న ఆమెను సేద తీరేలా చేసింది.

కిక్

కిక్


సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 2009లో వచ్చిన ఈ చిత్రం ఆమె కెరీర్ కు బాగా ప్లస్సైంది. చిత్రం ఘన విజయం సాదించింది.

జులాయి

జులాయి


2012 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి వచ్చేవరకూ ఆమె కెరీర్ స్ధబ్దంగానే ఉంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

బర్ఫీ

బర్ఫీ

2012లో హిందీలో బర్ఫీ చిత్రంతో ఆమె ఎంట్రి ఇచ్చింది. ఆ చిత్రం ఆమెకు అక్కడ మంచి పేరు తెచ్చింది.

ఖతర్నాక్

ఖతర్నాక్


2006లో రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం సూపర్ ఫ్లాఫ్ అయ్యింది. ఆమె కెరీర్ ని వెనక్కి తీసుకు వెళ్లింది.

ఆట

ఆట


2007లో సిద్దార్ద్ హీరోగా వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

భలే దొంగలు

భలే దొంగలు


2008లో తరుణ్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భలే దొంగలు చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది.

రెచ్చిపో

రెచ్చిపో


2009 లో పరుచూరి మురళి దర్శకత్వంలో నితిన్ హీరో గా వచ్చిన ఈ చిత్రం పెద్ద ఫ్లాఫ్ చిత్రంగా నమోదైంది.

సలీం

సలీం


2009లో వైవియస్ చౌదరి దర్సకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఈ చిత్రం ఈమె కెరీర్ ని మరింత వెనక్కి తీసుకు వెళ్లిపోయింది.

శక్తి

శక్తి

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 2011లో రూపొందిన ఈ చిత్రం మెగా డిజాస్టర్ గా నమోదైంది.

నేను నా రాక్షసి

నేను నా రాక్షసి


2012 లో తన మెంటర్ పూరి జగన్నాధ్ దర్సకత్వంలో వచ్చిన నేను నా రాక్షసి చిత్రం సైతం డిజాస్టర్ అయ్యింది.

దేముడు చేసిన మనుష్యులు

దేముడు చేసిన మనుష్యులు

2012లో పూరి జగన్నాధ్ దర్సకత్వంలో రవితేజ సరసన చేసిన దేముడు చేసిన మనుష్యులు చిత్రం సైతం పెద్ద ఫ్లాఫ్ గా నమోదైంది.

English summary
Ileana, will slash her remuneration by half if anyone offers her a Telugu film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu