Devara 2: ఎన్టీఆర్ దేవర 2లో భారీ ట్విస్టులు.. బాక్సాఫీస్‌ షేకయ్యేలా కొరటాల ప్లాన్స్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా నటించిన 'దేవర: పార్ట్ 1' గత ఏడాది బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదల రోజున మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం హిట్‌ రేంజ్‌లో నిలిచింది. సముద్రతీర నేపథ్యంలో నడిచిన ఈ మాస్ యాక్షన్ డ్రామా, ఎన్టీఆర్‌ ఇన్టెన్స్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతటీ భారీ విజయాన్ని అందుకున్న మూవీకి సీక్వెల్‌ అయిన 'దేవర 2'(Devara Part 2) గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ బజ్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ మ్యాటరేంటీ ?

కొరటాల శివ మాస్ ప్లాన్
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్‌ కథలో పలు కీలక మార్పులు చేశారు. ప్రధానంగా ఉత్తరాది ప్రేక్షకులను (North Indian audience) కూడా కనెక్ట్ అయ్యేలా యాక్షన్‌, రాజకీయ డ్రామా, భావోద్వేగ అంశాలతో కొత్త స్కెచ్‌ వేశారు. 'దేవర 1' సముద్రతీర నేపథ్యంలో సాగితే, ఈసారి కథ రాజకీయ నేపథ్యం, ప్రజా పోరాటం , కుటుంబ బంధాల చుట్టూ తిరుగుతుందని టాక్‌. కొరటాల శివ ఈసారి ఎన్టీఆర్ పాత్రకు మరింత పవర్‌ఫుల్ బ్యాక్‌స్టోరీ ఇచ్చి, ఆయన కెరీర్‌లో కొత్త హై సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

Devara 2 Major Script Changes and New Bollywood Hero Joins Jr NTR s Power-Packed Sequel

ఇద్దరూ హీరోయిన్లు-ఒక స్టార్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ!
అంతే కాకుండా హీరోయిన్లు విషయంలో కూడా మార్పు చేయబోతున్నారట. ఫస్ట్ పార్ట్‌లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో ఆమెతో పాటు మరో క్రేజీ హీరోయిన్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతోందట. ఈ కొత్త హీరోయిన్‌ ఎవరు? అనేది క్లారిటీ రాలేదు. అంతేకాదు, బాలీవుడ్‌ స్టార్ హీరో కూడా 'దేవర 2'లో ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆ నటుడి ఎంపికపై మేకర్స్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్‌కి డెప్త్!
ఫస్ట్ పార్ట్‌లో విలన్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్ పాత్రకు ఈసారి మరింత డెప్త్ ఇవ్వబోతున్నారని టాక్‌. ఆయన రోల్‌లో యాక్షన్‌, సైకాలజికల్ యాంగిల్‌లను మిక్స్ చేసి చూపించబోతున్నారట. దీంతో హీరో-విలన్ మధ్య క్లాష్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతోంది. 'దేవర 2'కి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో మరోసారి అనిరుధ్ రవిచందర్నే ఎంపిక చేశారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లకు సరిగ్గా సరిపోయే మాస్ బీట్స్‌ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయి
ఆర్ఆర్ఆర్ తో పాన్‌ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్‌కి 'దేవర'మరో గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు వచ్చే ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను చెరిపేసి, 'దేవర'తో బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాడు. ఈసారి సీక్వెల్‌తో కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రీపిట్ కాబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'దేవర 2' షూటింగ్ డిసెంబర్‌ నెలలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. ఆ సినిమా షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే 'దేవర 2' సెట్స్‌పైకి వెళ్లబోతున్నారట.

More from Filmibeat

Read more about: koratala siva jr ntr devara 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X