Don't Miss!
- News
తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన?: రాజకీయ సన్యాసం అంటూ ఉత్తమ్ సంచలనం
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Lifestyle
క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దర్శకుడు, హీరో మధ్య విభేదాలు.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్దం
అసురన్ లాంటి చిత్రంతో దక్షిణాదిన సంచలనంగా మారిపోయాడు హీరో ధనుష్. విడుదలైంది కేవలం తమిళంలోనే అయినా అతని నటన మాత్రం అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అసురన్ చిత్రం తమిళంలో వసూళ్ల సునామిని సృష్టించగా.. ఆ సినిమాపై పలు ఇండస్ట్రీల కన్నుపడింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధనుష్ లాంటి నటుడు, గౌతమ్ మీనన్ లాంటి వినూత్న దర్శకుడు కలిసి చేస్తే వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి ఓ ప్రాజెక్ట్‌పై అనేక రూమర్ల వినిపిస్తున్నాయి. ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నప్పుడు సహజంగానే భేదాభిప్రాయాలు తలెత్తుతుంటాయి. అయితే అవి స్థాయిని దాటి వెళితే ఆ ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తోట' అనే సినిమాను రూపొందించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా విషయంలో, గౌతమ్ మీనన్‌కి .. ధనుష్‌కి మధ్య ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చాయని టాక్. ఈ కారణంగానే ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లకి పైగా పట్టిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈనెల 29న విడుదల చేయనున్నారు. తెలుగులో 'తూటా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా విషయంలో దర్శకుడిని ధనుష్ పక్కన పెట్టేశాడని కొంతమంది అంటుంటే, గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు.