»   » 99 వెహికల్స్ తో బాలయ్య ఫ్యాన్స్

99 వెహికల్స్ తో బాలయ్య ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ అభిమానులు ఎప్పుడూ మిగతావారికన్నా భిన్నంగా ఉంటూంటారు. తమ అభిమానాన్ని తమదైన రీతిలో వ్యక్తం చేస్తూంటారు. ఇప్పుడు అదే రీతిలో బాలయ్య తాజా చిత్రం డిక్టేటర్ అడియో పంక్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

డిక్టేటర్ ... బాలకృష్ణకు 99వ చిత్రం కావడం వల్లే అభిమానులు హైదారాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని 'అమరావతి' డ్రైవింగ్ చేసుకుంటూ వెల్లడానికి 99 వెహికల్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు.


థమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతుండగా, డిసెంబర్ 20న అడియో విడుదల కార్యక్రమం జరగనుంది..


'Dictator' Audio: Fans to travel in 99 vehicles

చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు.


బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.


'Dictator' Audio: Fans to travel in 99 vehicles

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.


ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Fans of Balakrishna are driving from Hyderabad to Amaravathi for 'Dictator' Audio.
Please Wait while comments are loading...