War 2: వార్ 2 క్లైమాక్స్ మొత్తం మార్చేశారా? ఎన్టీఆర్‌కి అయాన్ ముఖర్జీ అలా షాక్
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా వార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన వార్ 2పై రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 14న విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
200 కోట్ల క్లబ్‌లోకి వార్ 2
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా .. రెండో రోజున 80 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండిపెండెన్స్ డే రోజున జూలు విదిల్చిన హృతిక్, ఎన్టీఆర్‌లు మూడో రోజున అదే రేంజ్‌లో బుకింగ్స్ జరుపుకుంటోంది. మూడో రోజున హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల సినిమాకు బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తంగా 3 రోజుల్లో వార్ 2 వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ రోల్‌పై విమర్శలు
అయితే సినిమా రిలీజైన నాటి నుంచి వార్ 2పై విమర్శకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు రివ్యూలు ఇస్తున్నారు. చాలామంది ఎన్టీఆర్‌కు సరైన రోల్ పడలేదని, హృతిక్ రోషన్ ముందు తేలిపోయాడని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ రేంజ్‌కు తగ్గ పాత్ర కాదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్, నటనకు ప్రాధాన్యమున్న పాత్రే అయినప్పటికీ.. తెర మీద హృతిక్ రోషన్ డామినేట్ చేసేశాడని చెబుతున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
క్లైమాక్స్‌పై న్యూస్ చక్కర్లు
అయితే మరో వర్గం మాత్రం ఎన్టీఆర్ వార్ 2లో బాగా చేశాడని ఆయన వల్లే సినిమా హిట్ అయ్యిందని అంటున్నారు. యాక్షన్ సీన్లు, డ్యాన్సులు, ఫైట్స్‌లలో ఎన్టీఆర్ అదరగొట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. క్లైమాక్స్ సీన్‌లో తన మార్క్ నటనతో ఏడిపించేశారని ప్రశంసిస్తున్నారు. కాగా.. వార్ 2కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అయాన్ ముఖర్జీ తొలుత చెప్పిన కథ వేరని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ పూర్తిగా మార్చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయాన్ ప్లాన్ వేరేనా?
ముందుగా అయాన్ ముఖర్జీ సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. ఎన్టీఆర్ పాత్ర చనిపోవాలి. కథ ప్రకారం ప్రధానమంత్రిపై జరిగే దాడి సమయంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చనిపోతుందట. గతంలో హృతిక్ నటించిన వార్ చిత్రంలోనూ హృతిక్ పాత్ర బతికే ఉండగా, మిగిలిన పాత్రలు చనిపోతాయి. అదే ఫార్ములా ప్రకారం ఎన్టీఆర్ రోల్‌ను క్లైమాక్స్‌లో చంపేయాల్సి ఉంది. అయితే కథను మార్చాలని తారక్ పర్సనల్‌గా మేకర్స్‌ని రిక్వెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన పాత్ర చనిపోతే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు జీర్ణించుకోలేరని అది సినిమాపై ప్రభావం చూపుతుందని చెప్పాడట. ఎన్టీఆర్ సలహా మేరకు వార్ 2లో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మేకర్స్ మార్చేశారట. అతని పాత్రను చంపేయకుండా భవిష్యత్తులో యశ్ రాజ్ ఫిలింస్ తీసే స్పై మూవీస్‌లో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











