twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 'సర్దార్' ని ఉద్దేశించా... రవితేజ కామెంట్?

    By Srikanya
    |

    ముంబై: ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని ఏ గాడ్ ఫాధరూ, బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదిగిన వ్యక్తి ఎవరూ అంటే హీరో రవితేజ అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పవచ్చు.

    మొదటి నుంచీ ఆయన మాస్ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ మాస్ రాజా గా సెటిలయ్యారు. ఆయనకు మాస్ లో భీబత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడూ వివాదాల్లో ఇరుక్కోలేదు..కానీ ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ..ఓ వర్గాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.

    రవితేజ మాట్లాడుతూ... తాను హిందీ బాగా మాట్లాడగలననీ, తెలుగు కంటే హిందీ భాషే బాగా వచ్చునని చెప్పాడు. తనది తెలుగు సినిమా నేపధ్యం కాబట్టి వెంటనే బాలీవుడ్ లోకి వెళ్లి విజయం సాధించాలన్న తపన లేదన్నాడు.

    అంతేకాకుండా స్టార్స్ కేవలం మాస్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ సినిమాలే చేస్తే భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ లు చవిచూడక తప్పదని అన్నారు. తాను చేసిన సినిమాల్లో కథ, కథనం మెప్పించే విధంగా ఉండటంతో తాను తెలుగులో ఏ సినిమా చేసినా అది తనను ముంబై చిత్ర పరిశ్రమకు దగ్గర చేస్తోందని రవితేజ తెలిపాడు.

    Did Ravi Teja Attack Pawan Kalyan?

    ఈ కామెంట్స్ వింటూంటే..చాలా మందికి పవన్ కళ్యాణ్..రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం, అక్కడ ఫెయిల్యూర్ అవ్వటం గుర్తుకు వస్తోంది. అయితే రవితేజ చాలా క్యాజువల్ ఈ మాటలు అన్నా పవన్ నే ఉద్దేసించి అన్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

    అలాగే రవితేజ కంటిన్యూ చేస్తూ... ఇటీవల విడుదలైన హిందీ చిత్రం 'కీ అండ్ కా' లాంటి సినిమా బాలీవుడ్ లో తాను కూడా చేయాలనుకున్నట్టు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ నేపథ్యంలో తాను కూడా హిందీ చిత్రాల్లో నటించాలంటూ చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పాడు.

    అయితే తెలుగు చిత్రపరిశ్రమపై మమకారంతో వచ్చిన అవకాశాలను వద్దంటూనే బాలీవుడ్ లో 'కీ అండ్ కా' లాంటి చిత్రంలో నటించాలనుకుంటున్నట్టు చెప్పకనే చెప్పేశాడు. కాగా, బాలీవుడ్ లో కీ అండ్ కా' లాంటి హిందీ సినిమాల్లో తాను నటించినా.. తెలుగు చిత్ర పరిశ్రమలో (యాక్షన్, కామెడీ)లతో తనదైన శైలీలో నటిస్తూనే ఉంటానని రవితేజ తెలిపాడు.

    English summary
    Raviteja clarified that he is not interested in Bollywood though he got many offers. He said if stars do only mass films keeping faith in masses they are bound to taste failures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X