»   » వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' నిర్మాత దిల్ రాజు కాదా?

వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' నిర్మాత దిల్ రాజు కాదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్, బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన 'మరో చరిత్ర' చిత్రాన్ని దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ చిత్రానికి నిజమైన నిర్మాత కాదని వినిపిస్తోంది. ఆ చిత్రాన్ని జగన్ అనే కొత్త ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారని, అందుకే మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారని చెప్తున్నారు. అతనే డబ్బు మొత్తం పెట్టి పబ్లిసిటీ కోసం, బ్యానర్ వ్యాల్యూ కోసం దిల్ రాజు ని ఆశ్రయించినట్లు చెప్తున్నారు. అలాగే ఆయనే దిల్ రాజు తో కలిసి మరిన్ని చిన్న చిత్రాలు కూడా ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ రీమేక్ ని రవి యాదవ్ అనే కెమెరామెన్ దర్శకుడుగా మారి డైరక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్ చేసిన పాత్రను వరుణ్ సందేశ్, సరిత చేసిన పాత్రను అనిత చేస్తున్నారు. ఎన్నారై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu