నితిన్ లేదా రామ్ చరణ్ వీళ్లద్దరిలో ఒకరే

ఇక రామ్ చరణ్, దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఎవడు'. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలఖరున కానీ, సంక్రాంతికి కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్‌చరణ్ వెల్లడించారు. తదుపరి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రారంభమవుతుందన్నారు.
తెలుగు సినిమాకీ, సంక్రాంతి పండగకీ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. విడుదలైన సినిమాలు ఎలా ఉన్నా... ఈ పండగ పూట మాత్రం బాక్సాఫీసు గల్లాపెట్టెలు నిండిపోతుంటాయంతే. అందుకే... దర్శకనిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి బరిలో నిలపాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వచ్చే ముగ్గుల పండక్కి చాలా సినిమాలు ముస్తాబవుతున్నాయి. మరో ప్రక్క 'హార్ట్‌ఎటాక్' సినిమాతో నితిన్, 'రేయ్'తో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రాబోయే సంక్రాంతికి రాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే ఈసారి సంక్రాంతి బరి మరింత హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.
అయితే సంక్రాంతి పోటిని తట్టుకోవటం కన్నా ముందే వచ్చేయటం బెస్ట్ అని కొందరు ఆలోచేస్తూంటారు. తాజాగా అలాంటి ప్లానే బిర్యాని నిర్మాతలు చేస్తున్నారు. హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి స్టిల్స్ విడుదల చేసారు. అవి అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











