»   »  రవితేజతో విబేధాలు... నాగార్జునను రంగంలోకి దించిన దిల్ రాజు?

రవితేజతో విబేధాలు... నాగార్జునను రంగంలోకి దించిన దిల్ రాజు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదాబాద్: రవితేజ, దిల్ రాజు కాంబినేషన్లో ‘ఎవడో ఒకడు' అనే సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కథ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో సినిమా ఆగి పోయింది. అయితే ఇప్పటికే అన్నీ సెట్ చేసుకున్న దిల్ రాజు సినిమా ఆగిపోతే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది. దీంతో ఇదే కథను నాగార్జునకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ప్రేమం తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఎవడో ఒకడు' అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Dil Raju's project: Ravi Teja out, Nagarjuna in?

2015 దసర పండగ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం అటకెక్కినట్లే అని అంటున్నారు. సినిమా ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా సినిమా కథ, సబ్జెక్ట్ విషయంలో రవితేజ, దిల్ రాజు మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఇపుడు ఇదే కథతో దిల్ రాజు నాగార్జునను సంప్రదించగా ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. అన్ని కుదిరితే వీలైనంత త్వరంగా సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

English summary
Ravi Teja and Dil Raju's upcoming project has been shelved, according to a reliable source. Film Nagar source said that, Nagarajuna entering this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu