Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దిల్ రాజుపై నిషేధం?
ఎ.పి.ఫిలిం ఛాంబర్..ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై బ్యాన్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణంయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఆ మధ్య మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్ కి సినిమాకు సంభందించిన ఏ విషయంలోనూ సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు తన జోష్ చిత్రం ఆడియో పంక్షన్ లైవ్ ని మాటీవీకి ఇవ్వటంతో ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్స్ కి పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవటానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అయితే మగధీర ఆడియో పంక్షన్ కూడా మాటీవీలో లైవ్ ఇవ్వటంతో అల్లు అరవింద్ పై యాక్షన్ తీసుకున్న తర్వాతే ఈ మేటర్ తేల్చాల్సి ఉంటుందని కొందరు సీనియర్స్ అంటున్నారు.