»   » దిల్ రాజు కూడా ఎమ్.ఎస్ రాజు రూటులోనే డైరక్టర్ గా ..!?

దిల్ రాజు కూడా ఎమ్.ఎస్ రాజు రూటులోనే డైరక్టర్ గా ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్య వరస ఫ్లాపులతో డీలా పడిన దిల్ రాజు మళ్ళీ బృందావనం, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలతో ఒడ్డున పడ్డారు. దాంతో ఆయనకు తన జడ్జిమెంట్ పై మళ్ళీ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది.అయితే ఆయకు ఆ కాన్ఫిడెన్స్ పెరగటం ఆయన బ్యానర్ లో చేస్తున్న డైరక్టర్స్ ఇబ్బందిగా మారిందని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పుటినుంచీ ఆయన స్క్రిప్టు విషయాల్లో ఓవర్ గా ఇంటర్ ఫియర్ అవుతున్నారని, ఆయన రోజూ వచ్చి ఇన్ పుట్స్ ఇస్తూంటారని, డబ్బులు పెట్టే నిర్మాతని కాదనలేక,తామ ఆలోచనలు చంపుకోలేక సతమతమవుతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసమే ఆయన ఫెయిల్యూర్స్ లో ఉన్న దర్శకులను తన బ్యానర్ లో అవకాశమిస్తున్నాడని, హిట్ లో ఉన్నవారైతే తమ మాట వినరని నమ్మకమని అంటున్నారు. గతంలో కూడా ప్రముఖ నిర్మత ఎమ్.ఎస్.రాజు కూడా వెలుగుతున్న రోజుల్లో ఇలాగే తాను స్క్ర్రిన్ ప్లే మాస్టర్ ని అని రైటర్స్ ని, డైరక్టర్స్ ని చిన్నచూపుచూస్తూండేవాడని హిట్ లు వచ్చినంతకాలం బాగానే ఉందని, ప్లాప్ లు మొదలయ్యాక ఆయన ఇప్పుడు తన కొడుకు సినిమానే పూర్తి చేసుకోలేకపోతున్నాడని అంటున్నారు. దిల్ రాజు వరస చూస్తూంటే భవిష్యత్ లో ఆయన కూడా ఎమ్.ఎస్ రాజు లాగే గ్యారెంటీగా డైరక్టర్ అవుతాడని, హిట్టా, ఫట్టా అనేది భవిష్యత్ నిర్ణయించాలని చెప్తున్నారు.

English summary
'Mr.Perfect' success is also having adverse affects on Dil Raju's current films that are in under production or pre-production stages. He is making many changes to his current films and also disturbing the progress of other scripts with his inputs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu