For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్: బోయపాటితో తమిళ హీరో.. బడా ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టామినా అమాంతం పెరిగిపోయింది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్ మీదనే పడింది. ఫలితంగా మన దర్శకులతో సినిమాలు చేసేందుకు పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకులు ఇప్పటికే బాలీవుడ్‌ హీరోలనే డైరెక్ట్ చేసేశారు. ఇప్పుడు కోలీవుడ్ హీరోలపై మరికొందరు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

  తెలుగు హీరోల కోసం ఆ డైరెక్టర్లు

  తెలుగు హీరోల కోసం ఆ డైరెక్టర్లు

  రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' తర్వాత తెలుగు సినిమా స్థాయి విశ్వవ్యాప్తం అయిపోయింది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో భారీ చిత్రాలు వస్తున్నాయి. దీంతో హీరోల స్టామినా, మార్కెట్ కూడా అందరికీ అర్థం అవుతోంది. దీంతో మన స్టార్లతో సినిమాలు చేసేందుకు అన్ని భాషలకు చెందిన దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నింటిని పట్టాలెక్కించేశారు.

  తెలుగు డైరెక్టర్ కోసం ఆ హీరోలు

  తెలుగు డైరెక్టర్ కోసం ఆ హీరోలు

  ఒకవైపు వేరే భాషల దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం వేచి చూస్తుంటే.. పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ముందడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు పరిచయం ఉన్న ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉండగా.. మరికొన్ని పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నాయి.

  హిందీలోకి ఇద్దరు యంగ్ డైరెక్టర్లు

  హిందీలోకి ఇద్దరు యంగ్ డైరెక్టర్లు

  గతంలో రాంగోపాల్ వర్మ.. పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు హిందీలో సినిమాలు తెరకెక్కించారు. అంతకు ముందూ ఆ తర్వాత కూడా చాలా మంది పలు భాషల్లో దర్శకత్వం చేశారు. ఈ క్రమంలోనే ఆ మధ్య సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి' రీమేక్‌ను హిందీలో తీశాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ' హిందీ రీమేక్ చేస్తున్నాడు. వీళ్లతో పాటు మరికొందరు ఆ బాటలోనే ఉన్నారు.

  క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు

  క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు

  భారీ చిత్రాలను తెరకెక్కించడంలోనూ.. క్రేజీ కాంబినేషన్‌లను సెట్ చేయడంలోనూ ఎప్పుడూ ముందుటాడు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పటికే తెలుగులో ఎంతో మందితో సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్‌ను తెలుగులోకి పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రకటన త్వరలోనే రానుంది.

  ఇంకో స్టార్ హీరో టాలీవుడ్ ఎంట్రీ

  ఇంకో స్టార్ హీరో టాలీవుడ్ ఎంట్రీ

  ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. అది ప్రకటించక ముందే మరో కోలీవుడ్ స్టార్‌ను లైన్‌లో పెట్టేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. తన చిత్రాల ద్వారా ఇప్పటికే సుపరిచితుడు అయిన టాలెంటెడ్ స్టార్ సూర్య. అవును.. అతడినే దిల్ రాజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడట.

  బోయపాటితో తమిళ హీరో జోడీ

  బోయపాటితో తమిళ హీరో జోడీ

  సూర్యను తెలుగులోకి లాంఛ్ చేసే బాధ్యతను తీసుకున్న దిల్ రాజు.. అందుకోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆయన మహేశ్ బాబుతో సినిమాకు కమిట్ అయ్యాడు. దీంతో మరో దర్శకుడి కోసం దిల్ రాజు అన్వేషిస్తున్నారని కూడా అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బోయపాటిని ఆయన ఫైనల్ చేశారట.

  #RIPKVAnand: Allu Arjun ఎమోషనల్‌.. ప్రముఖుల సంతాపం KV Anand చిత్రాలు పెద్ద హిట్ || Filmibeat Telugu
  బడా నిర్మాత అదిరిపోయే ప్లాన్

  బడా నిర్మాత అదిరిపోయే ప్లాన్

  టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు బోయపాటి. హీరో సూర్యకు కూడా అలాంటి పేరే ఉంది. అందుకే దిల్ రాజు వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కోసం సదరు దర్శకుడు అదిరిపోయే మాస్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడట. బాలయ్య ‘అఖండ' మూవీ పూర్తయిన వెంటనే ఇది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బాగా వినిపిస్తోంది.

  English summary
  Kollywood Star Hero Now Busy with Several Tamil Films. Then He Will Do straight Telugu movie Under Boyapati Srinu Direction. This film Produced by Dil Raju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X