»   »  పగ సాధించటం కోసం ఎన్టీఆర్ ని బలి?

పగ సాధించటం కోసం ఎన్టీఆర్ ని బలి?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఒకరి పగ తీర్చుకునే కార్యక్రమం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. అయితే అలాంటి పోగ్రామ్ ఒకటి ఎన్టీఆర్ తాజా చిత్రం రభస షూటింగ్ లో జరుగుతోందని అంటున్నారు. తనను లెంపపై కొట్టినందకు కూల్ గా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పగ తీర్చుకుంటున్నాడని అంటున్నారు. ఆ తీర్చుకునే ప్రాసెస్ లో భాగంగా షూటింగ్ సమయంలో నిర్మాతని ఇబ్బంది పెడుతున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటన్నాయి. రెగ్యులర్ షూటింగ్ జరగకుండా ఏదో ఒక వంకతో బ్రేక్ లు ఇస్తున్నాడని చెప్తున్నారు.

  ఈ మధ్య ఓ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ కలర్స్ నచ్చలేదని షూటింగ్ కాన్సిల్ చేసాడని, దాంతో చాలా ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. అంతుకు ముందు జ్వరం వచ్చిందని, మరోసారి అనారోగ్యం అని షూటింగ్ బ్రేక్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ బ్రేక్ లతో నిర్మాతకు తడిసిమోపుడువుతోంది. అయితే బెల్లంకొండకు ఈ నష్టం ఎలా ఉన్నా హీరో ఎన్టీఆర్ పై ఏ విధమైన ఇంపాక్ట్ పడుతున్నదనేదే ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఈ పగ తీర్చుకునే కార్యక్రమంతో సినిమాపై కాన్సర్టేషన్ పోతే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. కానీ ఇవన్నీ రూమర్స్ అని యూనిట్ వారు కొట్టిపారేస్తున్నారు.

  ఎన్టీఆర్, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ మధ్యన కొంతకాలం షూటింగ్ గ్యాప్ వచ్చిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మళ్లీ కంటిన్యూగా జరగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే పేరు పరిశీలనలో ఉంది. బెల్లకొండ సురేష్‌ నిర్మాత. సమంత, ప్రణీత హీరోయిన్స్.

  Director Santosh Srinivas harassing producer

  బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

  దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

  ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

  English summary
  Santosh Srinivas is reportedly harassing top producer Bellamkonda Suresh, by taking frequent breaks from the shooting of 'Rabhasa'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more