twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశాన్ని ఆకర్షించేలా RRRలో మరో చారిత్రాత్మక అంశం.. ఎమోషనల్ సీన్

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రూమర్స్ తగ్గేలా లేవని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి చారిత్రాత్మక అంశాలను తీసుకొని చేస్తున్న ఈ భారీ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరిలో ఎంతగానో ఆసక్తిని కలిగిస్తోంది.

    ఇక కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఈ పోరాట యోధుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కి మాత్రం అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి పాన్ ఇండియన్ సినిమాలో దేశాన్ని ఆకర్షించే ఒక ఇన్సిడెంట్ ని జక్కన్న కథలో జోడించినట్లు సమాచారం. ఇది స్వాతంత్ర్య సమరయోధుల కలయిక యొక్క కల్పిత కథ అని రాజమౌళి ముందే చెప్పడంతో వాస్తవ ఘటనలపై అంచనాలు ఉండకపోవచ్చు.

    Director ss rajamouli special plan for RRR movie

    అయితే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటైన జలియన్ వాలా బాగ్ ఉదంతంను సినిమాలో చూపించనున్నారట. 1919 లో బైసాఖి పండుగ సందర్భంగా అమాయక సిక్కు యాత్రికులపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ చేసిన ఉచకోత ఫలితంగానే వెయ్యి మంది భారతీయులు మరణించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేయాలని భారతీయులను ప్రేరేపించిన ముఖ్యమైన సంఘటనలలో ఇది కూడా ఒకటి. అయితే అలాంటి పాయింట్ ని జక్కన్న RRRలో చూపించనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    RRR is a big budget movie awaited not only by Telugu fans but all over the world by Indian movie lovers. It goes without saying that the expectations on this film are in any range. The latest Komuram Beam teaser has also increased the dose of expectations. Director Rajamouli's way of thinking is once again very clear.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X