twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత, రవితేజ సినిమాలు ఒకే పాయింట్‌తో.. డిస్కో రాజా స్టోరీ లీక్!

    |

    మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కో రాజా అనే చిత్రం ప్రారంభమైంది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోని విడుదల చేసింది. డిస్కోరాజా టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉండడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. డిస్కోరాజా కథ ఇదే అంటూ కొని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిస్కోరాజా చిత్ర కథ సమంత, నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఓబేబి అనే చిత్రాన్ని పోలివుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

    కొరియన్ మూవీ రీమేక్

    కొరియన్ మూవీ రీమేక్

    నందిని రెడ్డి సమంత కోసం ఆసక్తికరమైన కథ సిద్ధం చేశారు. కొరియాలో ఘనవిజయం సాధించిన మిస్ గ్రానీ అనే చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 80 ఏళ్ల వృద్ధురాలు ఓ ఫోటో స్టూడియోలోకి ప్రవేశించి ఊహించని విధంగా 20 ఏళ్ల యువతిలా మారిపోయి వస్తుంది.ఆసక్తికరమైన ఈ అంశంతో నందిని రెడ్డి, సమంత చిత్రం రూపొందుతోంది. సమంత వృద్దురాలిగా, యువతిగా ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తోంది.

    ‘96' రీమేక్: శర్వానంద్, సమంత సినిమా కోసం కాస్టింగ్ కాల్‘96' రీమేక్: శర్వానంద్, సమంత సినిమా కోసం కాస్టింగ్ కాల్

    అదే పాయింట్‌తో

    అదే పాయింట్‌తో

    విఐ ఆనంద్ రవితేజతో తెరకెక్కించే డిస్కో రాజా చిత్ర కథ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. జరుపుతున్న ప్రచారంను ప్రకారం.. ఈ చిత్రంలో రవితేజ ఆరంభంలో వృద్ధుడి పాత్రలో కనిపిస్తాడట. ఊహించని విధంగా మాయమైపోయిన అతడు యువకుడిగా తిరిగి వచ్చి ప్రతీకారం తీచుకుంటాడట. ఇదెలా సాధ్యమైందో తెలియాలంటే డిస్కోరాజా చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. డిస్కోరాజా చిత్రం సమంత ఓ బేబీ చిత్ర కథని పోలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..

    యాక్షన్ ఎక్కువగా

    యాక్షన్ ఎక్కువగా

    కథలోని పాయింట్ ఒకేలా కనిపిస్తున్నా డిస్కో రాజా, ఓ బేబీ చిత్రాలు రెండూ విభిన్నం అని అంటున్నారు. డిస్కోరాజలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓబేబి చిత్రం కామెడీ ప్రధానంగా సాగుతుంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాలు ఈమేరకు అలరిస్తాయో చూడాల్సి ఉంది.

    రవితేజకు తప్పనిసరిగా

    రవితేజకు తప్పనిసరిగా

    డిస్కోరాజా చిత్రం విజయం సాధించడం రవితేజ కెరీర్ కు చాలా కీలకం. రవితేజ గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని రవితేజ ఈ డిఫరెంట్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2017లో ఈ దర్శకుడికి కూడా ఒక్క క్షణం రూపంలో పరాజయం ఎదురైంది.

    English summary
    Disco Raja, O Baby! Yentha Sakkagunnave: Ravi Teja, Samantha movies are with same point
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X