»   » డాన్ శీను..గుణశేఖర్ 'వరుడు' స్కీమ్ ఫాలో అవుతున్నాడా?

డాన్ శీను..గుణశేఖర్ 'వరుడు' స్కీమ్ ఫాలో అవుతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, శ్రియ కాంబినేషన్ లో గోపీచంద్ మలినేని ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రెడీ అవుతున్న డాన్ శీను చిత్రం ఆగస్టు 6న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని, అయితే శ్రియని ఒక్కర్తినే ప్రమోట్ చేస్తూ రెండో హీరోయిన్ దాచి ఉంచుతున్నారని సమాచారం. తెరమీదే ఆమెని చూసి ధ్రిల్ అవ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్ల్ లో వినిపిస్తోంది. ఆమె బాలీవుడ్ ఆర్టిస్టు అంజనా సుఖానీ అని తెలుస్తోంది.వరుడు అప్పుడు కూడా ఇలాగే హీరోయిన్ భానుశ్రీ మెహతాని దాచి ఉంచి రివిల్ చేసారు. అలాగే సిద్దార్ధ నటించిన ఓయ్ చిత్రానికి కూడా హీరోయిన్ ఫోటోలు చివరి వరకూ బయిటకు రానివ్వలేదు. ఇక డాన్ శీను ఆడియో మొన్నే రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది.అలాగే శ్రీహరి ఈ చిత్రంలో కీలకమైన పాత్రను చేస్తున్నారు.

ఇక కథ ప్రకారం రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళంతా డాన్ శీను అని పిలుచుకుంటూంటాడు. దాన్ని నిజం చేసుకోవటానికి అతను హైదరాబాద్ వస్తాడు. అక్కడ డాన్ గా ఉన్న శ్రీహరి మనుషులను కొడతాడు. ఎందుకు కొట్టావు అంటే నీ దృష్టిలో పడటానికే అంటాడు. దాంతో అతను రవితేజని ఎలా గయినా ఇరికించాలని ముంబయిలో మరో పెద్ద డాన్ చెల్లెలను లైన్ లో పెట్టమని పురమాయిస్తారు. దాంతో అక్కడికి వెళ్ళిన శ్రీను తను పురమాయించిన అమ్మాయిని కాక తన చెల్లినే లైన్ లో పెట్టాడని తెలుసుకున్నా ఒరిజనల్ డాన్ రవితేజని ఏం చేస్తాడు...అలాగే రవితేజకు అంత అవసరం ఏమొచ్చిందనే ప్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుందంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ కథనం నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌అధినేత వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూంటే కె.అచ్చిరెడ్డి సమర్పకుడిగా..సహ నిర్మాతగా వి.సురేష్‌ రెడ్డి వ్యవహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu